ప్రాణం తీసిన ‘టిక్‌టాక్’: కువైట్‌లో తెలుగు యువకుడి ఆత్మహత్య

అమరావతి: సరదా వీడియోల సోషల్ మీడియా యాప్ 'టిక్‌టాక్' మరొకరి ప్రాణం తీసింది. తన తోటివారే లేని ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేసి ఆ యాప్‌లో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీంతో దాన్ని అవమానంగా భావించిన ఓ తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కువైట్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్ కుమార్(30) . ఉపాధి కోసం అతడు రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడే ఓ ఐరన్ షాపులో పనిచేస్తున్నాడు. తన తోటివారితోనే ఓ గదిలో కలిసి ఉంటున్నాడు.

A telugu youth allegedly committed suicide in Kuwait.

కాగా, ఓ వ్యక్తి వద్ద స్నేహితుల భాగస్వామ్యంతో చీటి కడుతున్నాడు. దాన్ని ఇటీవల పాడుకున్నాడు. స్నేహితులను డబ్బు ఇవ్వకుండా మొత్తం తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతని సహచరులు కొందరు మోహన్ కుమార్ ఫొటోలతో ఓ వీడియో తయారు చేశారు.

ఆ వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన మోహన్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురై నవంబర్ 3న తను ఉంటున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మోహన్ మృతదేహాన్ని ఆదివారం శివకోడుకు తీసుకొచ్చారు. ఈ సంఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మృతుడి బంధువులు తెలిపారు. మోహన్ కుమార్ మృతితో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+