తెలుగు టెకీ శివ చలపతిరాజు మృతదేహం తరలించేందుకు చందాలు, ఆయనది గోదావరి జిల్లే..
అమెరికాలో అర్ధాంతరంగా తనువు చాలించిన శివచలపతిరాజును మృతదేహం స్వదేశం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలో పీడిమాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్, గో ఫండ్ మీ సంస్థలు విరాళాలు సేకరిస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాలో ఒక పేజీని కూడా క్రియేట్ చేశాయి. శివ మృతదేహం ఇండియాకు తరలించేందుకు భారీగా ఖర్చవుతుందని.. అంతమొత్తంలో అతని కుటుంబం సేకరించలేదని సంస్థలు తెలిపాయి. అందుకోసమే తాము ఈ బాధ్యత తీసుకున్నామని వెల్లడించాయి.

ఏం జరిగిందంటే..
శివ చలపతిరాజు తన కుటుంబంతో నార్త్ కరోలినాలో ఉంటున్నారు. ఒరాకిల్ కంపెనీలో సాప్ట్‌వేర్ ప్రొగ్రామింగ్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య సౌజన్య గర్భవతి. అయితే అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు దరఖాస్తు చేశారు. దానిని అక్కడి అధికారులు బ్లాక్‌లాగ్‌లో పెట్టారు. దీంతో శివ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని బలవన్మరణానికి సరైన కారణం తెలియరాలేదు.

పుట్టెడు దు:ఖంతో..
తమ గ్రీన్‌కార్డు బ్లాక్‌లాగ్‌లో ఉండగా.. మరోవైపు భర్త శివ మృతి సౌజన్యను తీవ్రంగా కలచివేసింది. మమూలు మనిషి కూడా కాని సౌజన్య.. పుట్టెడు దు:ఖంతో ఇండియా బయల్దేరారు. తన భర్త మృతికి గ్రీన్‌కార్డు బ్లాక్‌లాగ్ కారణమని ఆమె చెప్తున్నారు. ఒక్క శివనే కాదు చాలామంది గ్రీన్‌కార్డులను బ్లాక్‌లాగ్‌లో అమెరికా ఎంబసీ అధికారులు పెట్టారు.

ఇదీ నేపథ్యం..
శివ చలపతిరాజు స్వస్థలం ఉభయ గోదావరి జిల్లాలని తెలుస్తోంది. ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన సమాచారం ఆధారంగా గోదావరి జిల్లాలకు చెందినవారని సమాచారం. శివ రాజమహేంద్రవరంలో చదివారు. తర్వాత హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసించి అమెరికా వెళ్లారు. సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామర్‌గా స్థిరపడ్డారు. కొన్నాళ్ల క్రితమే సౌజన్యతో వివాహం జరిగింది. కొద్దిరోజుల్లో తండ్రి కాబోతున్న తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

విప్రోలో కూడా..
ఒరాకిల్ సంస్థ కన్న ముందు శివచలపతిరాజు పలు కంపెనీల్లో జాబ్ చేశారు. మిచిగాన్‌లో విప్రో సంస్థలో పనిచేశారు. అంతకుముందు ఇల్లినాయిస్‌లో బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో కూడా విధులు నిర్తర్తించారు. బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో కెరీర్ ప్రారంభించారు. తర్వాత విప్రో, ఒరాకిల్‌కు మారారు. ఆయా కంపెనీల్లో హోదా, శాలరీ వచ్చిన.. గ్రీన్‌కార్డ్ మాత్రం రాకపోవడంతో శివను కలచివేసింది. అందుకోసమే ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications