• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రియుడి మోజులో .. పెళ్ళైన వారానికే భర్తను చంపించిన భార్య

|

ప్రియుడి మోజులో వారం రోజులకే కట్టుకున్న వాడిని కడతేరేలా చేసిందో నవవధువు. అత్యంత కిరాతకంగా భర్తను హతమార్చేలా చేసింది. పెళ్లికి రెండేళ్ల నుంచి ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న యువతి పెళ్లి కావడంతో తన ప్రేమాయణానికి భర్త అడ్డు అని భావించింది. ప్రియుడితో కలిసి ఉండలేనని భావించి అతడితోనే భర్తను హత్య చేయించింది. వారం రోజుల తర్వాత కేసును చేధించిన పోలీసులు ప్రియుడితో పాటు యువతిని అరెస్ట్ చేశారు. కాళ్ళ పారాణి ఆరాక ముందే అత్యంత కర్కశంగా భర్తను హతమార్చిన నాగలక్ష్మి కటకటాలపాలైంది.

రవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసుల గాలింపు .. ఇంతకీ రవి ప్రకాష్ ఎక్కడ ?

తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణకు వేపకాయలపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో మే 15న వివాహం జరిగింది. ఎంఎస్సీ చదివి మండపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు సూర్య నారాయణ. మే 21వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి వేపకాలయపాలెంలోని అత్తారింటికి వెళ్లిన సూర్యానారాయణ సాయంత్రం వేళ ఓ పని ఉందని, 8గంటలకల్లా వచ్చేస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. 22వ తేదీ ఉదయం పెనుగుదురు-పాతర్లగడ్డ మార్గంలో పంట పొలాల వద్ద శవమై కనిపించాడు. అక్కడ సూర్యనారాయణ బైక్ కనిపించడంతో సమీపంలో వెతికగా సమీపంలోనే మృతదేహం లభించింది. అత్యంత కిరాతకంగా తల నరికి హత్య చేసి గడ్డి కప్పి ఉంచడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

llegal affair .. wife killed her wife after one week of the wedding

కాకినాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన పోలీసులు గ్రామంలో పలువురిని విచారించగా నాగలక్ష్మి అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ప్రియుడు రాధాకృష్ణను అదుపులోకి తీసుకు విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తమ అక్రమ సంబంధానికి భర్త ఎక్కడ అడ్డొస్తాడోనన్న ఆందోళనతో నాగలక్ష్మి సూచనతో సూర్యనారాయణను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రాధాకృష్ణతో పాటు నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే నాగలక్ష్మి కడతేరేలా చేసింది. మానవత్వాన్ని మరచిపోయి పాశవికంగా ప్రవర్తించి సూర్యనారాయణను హతమార్చిన ఇద్దరు జైలులో ఊచలు లెక్కేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A mathematics lecturer was found dead under mysterious circumstances in East Godavari district. He murdered by his wife's lover. According to the police,The victim was identified as Peketi Suryanarayana, who worked as a junior lecturer and he got married with nagalakshmi a week days back. Nagalakshmi has a illegal affiar. because of that affair She was murdered her husband by her boy friend, assuming she could not be with him. A week later, police arrested the lover along with Naga lakshmi and revealed the murder plan .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more