IPL 2023 : కొహ్లీ ఐపీఎల్ 2016 రికార్డును ఈసారి బ్రేక్ చేసే మొనగాడు అతనే-రవిశాస్త్రి జోస్యం..

ఈ ఏడాది ఐపీఎల్ లో ఎప్పటిలాగే పరుగుల ప్రవాహం కొనసాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ పరుగుల ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఎన్నో మ్యాచ్ ల్లో 200పైచిలుకు స్కోర్లు సర్వ సాధారణమైపోతున్నాయి. ఇదే క్రమంలో ఈసారి ఐపీఎల్లో పరుగుల సునామీతో రికార్డులు తిరగరాసే క్రికెటర్ ఎవరనే చర్చ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా 2016 ఐపీఎల్ సీజన్లో పరుగుల సునామీ సృష్టించి ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కొహ్లీ రికార్డును ఈసారి ఎవరు బ్రేక్ చేస్తారన్న చర్చ మొదలైంది.

విరాట్ కొహ్లీ 2016 ఐపీఎల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రతీ మ్యాచ్ లోనూ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. ఆరెంజ్ క్యాప్ ను తనకే సొంతం అన్నట్లుగా సీజన్ ఆద్యంతం తన దగ్గరే ఉంచుకున్నాడు. చివరికి ఆ సీజన్లో 973 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా కొహ్లీ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఈ రికార్డును ఈ సీజన్ లో ఎవరైనా బ్రేక్ చేసే అవకాశం ఉందా అన్న చర్చ కూడా మొదలైంది.

 kohliravi

2016 ఐపీఎల్లో పరుగుల సునామీతో విరాట్ కొహ్లీ సృష్టించిన రికార్డును ఈ సీజన్ లో బ్రేక్ చేసే సత్తా ఉన్న క్రికెటర్ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌ ప్రశ్నోత్తరాల సెషన్‌లో శాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టగల వ్యక్తిగా గిల్‌ను ఎంచుకున్నాడు. గిల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఉండాలని, ఎందుకంటే అప్పుడే అతనికి పరుగులు చేయడానికి చాలా అవకాశాలు లభిస్తాయన్నాడు. గిల్ మంచి ఫామ్‌లో ఉన్నందున, అతను టాప్ ఆర్డర్ లో ఆడుతున్నందున శుభ్‌మాన్ గిల్ కు కొహ్లీ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు శాస్త్రి తెలిపాడు.

 gill

ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న పిచ్ లు బాగున్నాయని, కాబట్టి గిల్ రెండు లేదా మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 80-100 పరుగులు చేయగలిగితే కొహ్లీ రికార్డు బ్రేక్ చేసేందుకు అవకాశాలు మెరుగుపడతాయని రవిశాస్త్రి వెల్లడించాడు. వాస్తవానికి చూసుకుంటే కొహ్లీ రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టమని, ఎందుకంటే 900-ప్లస్ పరుగులు చాలా పెద్దవని శాస్త్రి తెలిపాడు. కానీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లకు రెండు అదనపు మ్యాచ్‌లు, రెండు అదనపు ఇన్నింగ్స్‌లు లభిస్తాయన్నాడు. కాబట్టి వారు సాధ్యమైతే మాత్రమే ఈ రికార్డును బద్దలు కొట్టగలరని విశ్లేషించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+