Couple: దేవుడి దర్శనం చేసుకుని నేరుగా హోటల్ లోని రూమ్ లోకి వెళ్లి దంపతులు ఏం చేశారంటే ?

పళని/చెన్నై/తిరువనంతపురం: దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పక్కరాష్ట్రంలోని ప్రసిద్ది చెందిన ఆలయంలో స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. ప్రైవేట్ హోటల్ లో రూమ్ తీసుకున్న దంపతులు తరువాత ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. దైవ దర్శం అయిన తరువాత అదే హోటల్ లోని రూమ్ లోకి వెళ్లి లోపల లాక్ చేశారు. మరుసటిరోజు అయినా దంపతులు బయటకు రాకపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. హోటల్ లోని రూమ్ లో ఒకేఫ్యాన్ కు దంపతులు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. రూమ్ లో చిక్కిన డెత్ లో షాకింగ్ సమాచారం ఉంది.

కేరళ దంపతులు

కేరళ దంపతులు

కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని పల్లరుతి ప్రాంతంలో రఘు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఉషా అనే మహిళు రఘు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రఘు, ఉషా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. ఎక్కడికి వెళ్లినా రఘు, ఉషా దంపతులు కలిసేవెళ్లేవారు.

పళనిలో శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం

పళనిలో శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం

తమిళనాడులోని పళనిలోని సుబ్రమణ్యస్వామి దేవాలయం ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆలయం అని ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. తమిళనాడులోని పళని చేరుకున్న రఘు, ఉషా దంపతులు ప్రసిద్ది చెందిన ఆలయంలో స్వామి దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. పళనిలో ప్రైవేట్ హోటల్ లో రఘు, ఉషా దంపతులు రూమ్ తీసుకున్నారు.

రూమ్ లో నుంచి బయటకురాలేదు

రూమ్ లో నుంచి బయటకురాలేదు

రఘు, ఉషా దంపతులు ఆహోటల్ లో శుభ్రంగా స్నానం చేసుకుని తరువాత సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. దైవ దర్శం అయిన తరువాత అదే హోటల్ లోని రూమ్ లోకి వెళ్లిన రఘు, ఉషా దంపతులు లోపల లాక్ చేశారు. తరువాత హోటల్ సిబ్బంది ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి ఎవ్వరూ మాట్లాడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న దంపతులు

ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న దంపతులు

మరుసటిరోజు అయినా రఘు, ఉషా దంపతులు బయటకు రాకపోవడంతో పళని పోలీసులు రూమ్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. హోటల్ లోని రూమ్ లో ఒకేఫ్యాన్ కు రఘు, ఉషా దంపతులు ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించారు. రఘు, ఉషా దంపతులు ఉన్న రూమ్ లో చిక్కిన డెత్ లో షాకింగ్ సమాచారం ఉంది.

పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

మమ్మల్ని మా బంధువులు టార్చర్ పెట్టి పరువు తీశారని, మా ఆత్మహత్యలకు వాళ్లే కారణం అని వాళ్ల పేర్లుతో సహ రఘు, ఉషా దంపతులు డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కేరళలోని రఘు, ఉషా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసు విచారణ చేస్తున్నామని తమిళనాడులోని పళని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+