బడేమియా.. చోటేమియా అంటూ కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ రావు సెటైర్లు

సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, బీజేపీని గెలిపించడానికి కొన్ని చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్​లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్ ​రావు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. గద్దెనెక్కిన తర్వాత ఆడబిడ్డలను మరిచిందని విమర్శించారు.

Harish Rao hits out at congress bjp in siddipet election campaign

ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్(BRS) పార్టీపై అక్కసు వెళ్లగక్కడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికార అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే.. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే, పెనం మీద నుంచి పొయ్యిలో పడతామని తెలిపారు.

అబద్దాలు చెప్పడంలో బీజేపీ బడేమియా అయితే.. కాంగ్రెస్ చోటేమియా అని సెటైర్లు వేసిన హరీశ్ రావు.. ఆ రెండు పార్టీలు అబద్దాల్లో పోటీ పడుతున్నాయన్నారు. గులాబీ పార్టీ లేకుండా చేయాలని బడే బాయ్ చోటే బాయ్ ఒక్కటయ్యారన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) దగ్గర సరుకు లేదు, పని లేదు.. అందుకే లీకులు ఫేకు వార్తలు కాలం గడుపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మండిపడ్డారు హరీశ్ రావు. ఎలక్షన్ల ముందేమో రూ.2500 ఇచ్చి వడ్లు కొంటామని రేవంత్​ రెడ్డి ఆర్భాటంగా చెప్పారని.. ఇవాళ జనగామ మార్కెట్​లో చూస్తే రూ.1560కు వడ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇవాళ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్‌​కు తరలించుకొని పోయి రూ.150కోట్ల అభివృద్ధి పనులను ఆపిందని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ సర్కారు రైతులకు బోనస్ ఇస్తామని మోసం చేసిందన్నారు. పదేళ్లలో బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదన్న హరీశ్.. రాముడి పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+