సిద్దిపేటలో అపశృతి.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి.. హరీశ్ రావు సాయం

సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. పిడుగు పాటు కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. చింతల చెరువు కట్టపై పిడుగు పడటంతో అక్కడే ఉన్న హనుమాన్ నగర్ వాస్తవ్యులు పస్తం శ్రీనివాస్, బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయారని సమాచారం అందగానే మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన హరీశ్ రావు.. రెండు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

siddipet Lightning strike cause to two persons death

పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాల పాలైన చెన్నూరు సారయ్య ప్రభుత్వ వైద్య కళాశాలతో చికిత్స పొందుతున్నారు. ఆ మేరకు ఆయన్ని పరామర్శించారు హరీశ్ రావు. సారయ్యకు మెరుగైన చికిత్స అందించాలని అక్కడి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అవసరం అనుకుంటే హైదరాబాద్ తరలించి మంచి వైద్యం అందించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+