సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేఏ పాల్‌ను వేశాడు.. చెంపచెల్ అనిపించిన యువకుడు, ఎక్కడ, ఎందుకంటే (వీడియో)

|
Google Oneindia TeluguNews

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో అటాక్ జరిగింది. ఆయన చెంపచెల్ అనిపించిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. ఆయనను పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు.

పోలీసుల తీరును పాల్ ఖండించారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప దెబ్బ కొట్టాడు. హఠాత్ పరిణామంతో ఒక్కసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. దాడి చేసిన యువకుడు టీఆర్‌ఎస్ నాయకుడిగా తెలుస్తోంది. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

someone attacked prajasanti party chief ka paul at siddipet district jakkapur village. while he comes to sircilla district for farmers consultation

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు తెలుసుకున్నారు. జక్కాపూర్ వద్ద పోలీసుల అడ్డుకోగా.. అక్కడే సదరు వ్యక్తి ఉన్నాడు. మాట్లాడే సమయంలోనే ఒక్కసారిగా దాడి చేశాడు. పోలీసులపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వోద్యోగులా లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అని నిలదీశారు. మీకు కేటీఆర్ జీతాలు ఇస్తున్నాడా.. ప్రజల సొమ్ము నుంచి జీతాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు.

పోలీసుల తీరును పాల్ తప్పుపట్టారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. రైతులను ఇటు సీఎం కేసీఆర్, అటు ప్రధాని మోడీ పట్టించుకోకుంటే.. ఎవరూ పట్టించుకోవాలని అడిగారు. రైతుల వెతలు తెలుసుకునేందుకు వస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. అంతేకాదు తనకు ప్రాణహానీ ఉందని ఆయన చెప్పారు. పోలీసుల ఎదుటే దాడి చేశారని.. ఇక తన ప్రాణాలకు రక్షణ ఏదని అడిగారు.

English summary
someone attacked prajasanti party chief ka paul at siddipet district jakkapur village. while he comes to sircilla district for farmers consultation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X