ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న‌లో భాగంగా గ‌తంలో ఉన్న ఆముదాలవ‌ల‌స మున్సిపాలిటీ ప‌రిధిలోని రెండు గ్రామాల తో పాటుగా ఆముదాల‌వ‌ల‌స మండ‌లంలోని నాలుగు గ్రామాలు ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లాయి. రాష్ట్ర రెవి న్యూ శాఖా మంత్రిగా ప‌ని చేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు రెండు సార్లు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలుపొందారు. 2004, 2009 లో ఇక్క‌డి నుండి గెలిచిన ధ‌ర్మాన సుదీర్ఘ కాలం మంత్రిగా ప‌ని చేసారు. ఇక్క‌డి నుండి టిడిపి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన గుండ‌ల అప్ప‌ల సూర్య‌నారాయణ‌ ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. 1952 లో ఇక్క‌డి నుండి గెలిచిన కావ‌లి నారాయ‌ణ 1999 లో స్పీక‌ర్ అయిన కావ‌లి ప్ర‌తిభా భార‌తికి మామ అవుతారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ది ఇక్క‌డ త‌న ప్ర‌భావాన్ని నిరూపించారు.

14 సార్లు ఎన్నిక‌లు.. హోరాహోరీ..
శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం లో 1952 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జరిగాయి. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి ఆరు సార్లు, కెఎల్‌పి, జ‌న‌తా, స్వ‌తంత్ర పార్టీ అభ్య‌ర్దులు ఒక్కోసారి గెలిచారు. ఇక్క‌డి నుండి గెలిచిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తొలుత నేదురుమ‌ల్లి, కోట్ల క్యాబినెట్ లో ప‌ని చేసారు. 2004 లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత వైయ‌స్ క్యాబినెట్‌లో మంత్రిగా మొద‌లై..2014 వ‌ర‌కు మంత్రిగా కొన‌సాగి రికార్డు నెల‌కొల్పారు. ఆయ‌న సోద‌రుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ న‌ర‌స‌న్నపేట నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అయిదు సార్లు గెలిచిన సీనియ‌ర్ నేత గౌతు ల చ్చ‌న్న 1985 లో ఇక్క‌డి నుండి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. 1983 లో గెలుపొందిన తంగి స‌త్యనారాయ‌ణ స్పీక‌ర్ ప‌ద వి చేప‌ట్టారు. 1984 లో నాదెండ్ల క్యాబినెట్‌లో చేర‌టం కోసం స్పీక‌ర్ ప‌ద‌వి వ‌దులుకున్నారు.

amadalavalasa Constituency

2014లో టిడిపి గెలుపు..ద‌ర్మాన ఓట‌మి..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తంగా 227798 ఓట‌ర్లు ఉండ‌గా.. అందులో 163618 మంది ఓటు హ‌క్కు వినియోగించుకు న్నారు. టిడిపి నుండి పోటీ చేసిన ల‌క్ష్మీ దేవి 88814 ఓట్లు సాధించ‌గా..వైసిపి నుండి పోటీ చేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 64683 ఓట్లు సాధించారు. టిడిపి నుండి పోటీ చేసిన లక్ష్మీదేవి 24131 మెజార్టీ ద‌క్కించుకున్నారు. 2009 ఎన్నిక‌ల వ‌ర‌కు కాంగ్రెస్ లో ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద రావు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసిపి లో చేరారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. సిబిఐ ఛార్జ షీట్ దాఖ‌లు చేయ‌టంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసారు. అయినా..ధ‌ర్మాన సోద‌రులు ఇద్ద‌రూ వైసిపి లోనే కొన‌సాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+