ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాలకొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఎస్సీ నుండి ఎస్టీగా రిజర్వ్ అయింది. పాలకొండ, భామి ని, సీతంపేట, వీరఘట్టం మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు ఉన్న కొత్తూరు నియోజకవర్గం 2009 పునర్విభజన లో భాగంగా రద్దు అయింది. ఇక్కడి నుండి టిడిపి సీనియర్ నేత నిమ్మక గోపాలరావు నాలుగు సార్లు గెలిచారు. విశ్వాసరాయ నరసింహారావు మూడు సార్లు గెలుపొందారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గోమాంగో సమీప బంధు వు అయిన జన్నిమినతి గోమాంగో 2004 లో ఇక్కడి నుండి గెలిచారు. అఇయతే, 2009 లో టిక్కెట్ దక్కలేదు. పాలకొండ నియోజకవర్గంలో ప్రస్తుత రాజాం ఎమ్మెల్యే 2204 లో టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నాటికి ఇక్కడి రాజకీయ పార్టీల అభ్యర్ధులు..సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
14 సార్లు ఎన్నికలు..
పాలకొండ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి నాలు గు సార్లు, స్వతంత్ర పార్టీ రెండు సార్లు. జనతా ఒకసారి గెలిచాయి. తలే భద్రయ్య రెండు సార్లు, పిజె అమృత కుమారి రెం డు సార్లు గెలుపొందారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కొత్తపల్లి నరసయ్య మరో రెండు సార్లు పొందూరు, ఎచ్చెర్లలో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసిన విశ్వాసరాయ కళావతి 2014 ఎన్నికల నాటికి వైసిపి లో చేరారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2004 ఎన్నికల్లో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 168126 ఓట్లు ఉండగా, అందులో120046 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన కళావతికి 55337 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణ కు 53717 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి కళావతి 1620 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరకు లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఈ నియోకవర్గంలో 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ది కొత్తపల్లి గీతకు మెజార్టీ దక్కింది. ఆ ఎన్నికల్లో గీత వైసిపి నుండి గెలిచి ఆ తరువాత టడిపిలోకి ఫిరాయించారు.












Click it and Unblock the Notifications