ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: టెక్కలి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత కోట బొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి మండలాలు పూర్తగా టెక్కలి నియో జకవర్గంలో చేరాయి. 1962 నుండి 2004 వరకు సిటింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ నియోజకవర్గం నుండి ఎన్నిక కాలేదు. ఈ నియోజకవర్గం నుండి మాజీ స్పీకర్ రొక్కం లక్ష్మీ నరసింహ దొర ఒక్కరు మాత్రమే రెండు సార్లు ఎన్నికయ్యారు. 1994 లో టిడిపి వ్యస్థాపకులు ఎన్టీఆర్ ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఈ సీటుకు రాజీనామా చేసారు. ఈ స్థానాన్ని వదిలి హిందూపూర్ నుండి కొనసాగారు. ప్రస్తుత మంత్రి అచ్చంనాయుడు ఇదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహి స్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్ధి సైతం ఇక్కడ బలమైన పోటీ ఇచ్చారు. ఇక, 2009 లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన వ్యక్తే 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్దిగా పోటీ లో నిలిచారు.
15 సార్లు ఎన్నికలు..
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం 1952 లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం లో మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఏడు సార్లు, జనతా పార్టీ ఒకసారి, స్వతంత్ర పార్టీ రెండు సార్లు, ఒక సారి ఇండిపెండెంట్ గెలిచారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచిన రేవతీపతి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే గుండెపోటుతో మరణించారు. ఆయన అచ్చంనాయుడు పై గెలుపొందారు. దీంతో..ఉప ఎన్నిక జరిగింది. అందులో ఆయన భార్య భారతి టిడిపి నేత అచ్చం నాయుడు పై గెలుపొందారు. రేవతిపతి సైతం 1999 లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, 2009 ఎన్నికల నుండి 2014 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

2014 లో టిడిపి గెలుపు..
2014 లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా 205744 ఉండగా, అందులో 159523 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన అచ్చం నాయుడుకు..81167 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ కు 72780 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి అచ్చంనాయుడు 8387 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి అభ్యర్దిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ 2009 లో ఇదే నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత అచ్చంనాయుడు మంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో అసెంబ్లీ లోపలా..బయటా ప్రభుత్వానికి ప్రధాన వాయిస్ అయ్యారు. జిల్లాలో మొత్తంగా పార్టీ కి కీలక నేతగా ఎదిగారు.












Click it and Unblock the Notifications