Crime News: పట్టపగలు వ్యభిచారం.. పోలీసులకు చిక్కిన ఐదు జంటలు..
చాలా మందికి బలహీనతలు కొందరికి తాగుడు బలహీనత, కొందరికి పేకాట బలహీనత, ఇంకొందరికి అమ్మాయిల బలహీనత ఉంటుంది. అయితే కొందరు ఈ బలహీనతలను క్యాష్ చేసుకుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయిల బలహీనతలను అసరా చేసుకుని వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచారం గృహాలపై పోలీసులు దాడి చేశారు.
రెండు లాడ్జీల్లో
రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఈశ్వరప్రసాద్ తమ సిబ్బందితో ఏకకాలంలో రెండు లాడ్జీల్లో సోదాలు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. డే అండ్ నైట్ కూడలి సమీపంలో ఉన్న శ్రీరామ, ఎన్‌ఎస్‌ఆర్ లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బుధవారం మధ్యాహ్నం లాడ్జీల్లో ఆకస్మికంగా దాడులు చేశారు.

ఆధార్ కార్డుతో సహా
లాడ్జీల్లో అసంఘీక కార్యకాలపాలు జరుపుతున్న ఐదు జంటలను పట్టుకున్నట్లు సీఐ చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని కొన్ని లాడ్జీలు, బలగ తదితర ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. లాడ్జిలోకి ఎవరు వచ్చినా వారి ఆధార్ కార్డుతో సహా నోట్ చేసుకోవాలని యాజమాన్యలకు స్పష్టం చేసిన వివరించారు.












Click it and Unblock the Notifications