శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మాడ చంద్రబాబు దివాణమా.. బాబులను జాకీలేసినా లేపలేవు అచ్చెన్న, నిమ్మగడ్డపై సాయిరెడ్డి నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల హీట్ పీక్‌కి చేరింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మీ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులనే సర్పంచ్‌గా డిక్టేట్ చేస్తారా అంటూ ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పనిలో పనిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై కూడా మండిపడ్డారు.

నిమ్మాడ దివాణమా..

నిమ్మాడలో పంచాయతీ అభ్యర్థిపై గందరగోళం నెలకొంది. ఇతర పార్టీకి చెందిన (అనుబంధ సభ్యులు) నామినేషన్ వేసేందుకు వస్తే ఇబ్బందులు సృష్టించారు. నిమ్మాడ అంటే అచ్చెన్నాయుడు/ రామ్మోహన్ నాయుడు కంచుకోట. అందుకే అక్కడ టీడీపీ/ చంద్రబాబు నాయుడు చెప్పిన అభ్యర్థులే నామినేషన్ వేయాలా అని అడగారు. నిమ్మాడ చంద్రబాబు మీకు రాసిచ్చిన దివాణమా అంటూ ఫైరయ్యారు. మీరు నిర్ణయించిన వ్యక్తి తప్ప.. మరొకరు నామినేషన్ వేయొద్దా అని అడిగారు. అంతేకాదు అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు మీ తీరు ఉంది అని విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.

4 సీట్లు కూడా గెలవదు...

4 సీట్లు కూడా గెలవదు...


పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవలేమని ఫిక్సయ్యిందని విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే లేని పోని ఆరోపణలు చేస్తుందని తెలిపారు. కనీసం 4 సీట్లు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందన్నారు. అందుకే కోసం నిమ్మగడ్య యాప్ తెరపైకి వచ్చిందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్‌కు యాప్ ఉందని గుర్తుచేశారు. మరీ కొత్తగా సీక్రెట్ యాప్ ఎందుకు అని అడిగారు. దీనిని ఎవరూ కంట్రోల్ చేస్తారు ప్రశ్నించారు. కొంపదీసి కంట్రోల్ రూం టీడీపీ ఆఫీసులో లేదు కదా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు, చిన బాబు లోకేశ్‌ను జాకీలేసినా లేపలేవు అని విమర్శించారు. చంద్రబాబు/ లోకేశ్ పని అయిపోయిందని తనదైన శైలిలో విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.

వార్..

వార్..


ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. అప్పటినుంచి వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమయ్యారు. కానీ నేతల మధ్య మాటలయుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

English summary
ysrcp mp vijaya sai reddy slams nimmagadda ramesh kumar and tdp ap president atchannaidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X