వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడో ఎంపిక కావాల్సింది: పొలార్డ్

|
Google Oneindia TeluguNews

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2020లో ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ను పటిష్టం చేసుకుంది. బంతితో జస్ప్రీత్ బుమ్రా 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా... బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 43 బంతుల్లో 79 నాటౌట్‌ గా నిలిచాడు. సూర్యకుమార్ విజృంభణతో సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మెరుపులు, భారీ హిట్టింగ్‌లు లేవు కానీ ముంబై ఖాతాలో విజయం చేరిందంటే దానికి ప్రధాన కారణం సూర్యకుమార్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సూర్యకుమార్‌ యాదవ్ 43 బంతుల్లో 79 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ముంబైని ఒంటిచేత్తో ప్లేఆఫ్‌కు చేర్చాడు. సూర్యకుమార్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్‌ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై మ్యాచ్‌ అనంతరం ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ స్పందించాడు.

With a huge talent Mumbai Indians star batsman Suryakumar Yadav should have earned a place in the Indian side longtime back said Kieron Pollard.

'ఈరోజు సూర్యకుమార్‌ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతనిలో ఉన్న నైపుణ్యతకు ఎప్పుడో టీమిండియాలో అడుగుపెట్టాల్సింది. అయితే తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడం పట్ల సూర్యకుమార్‌ తీవ్ర నిరాశ చెంది ఉంటాడు. ఓ కుర్రాడు మూడో స్థానంలో వచ్చి అలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరిపోరాటం చేశాడు. అతను నిలకడగా ఆడటమే మాకు చేసే అత్యంత మేలు. ఒక ఆటగాడిగా ఇలా నిలకడగా ఆడుతుంటే రివార్డులు వాటంతట అవే వస్తాయి. నేనేం చేయాలని జట్టు ఆశిస్తుందో అదే చేస్తాను. జట్టు బాగా ఆడితే సంతోషంగా ఉంటా' అంటూ పొలార్డ్‌ పేర్కొన్నాడు.

వాస్తవానికి గత రెండేళ్లుగా సూర్యకుమార్‌ యాదవ్‌ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒక అనామక ప్లేయర్‌గా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై ఇండియన్స్‌కు వచ్చిన తర్వాత బాగా రాటుదేలాడు. 2018 నుంచి ముంబై తరపున ఐపీఎల్‌లో ఆడుతున్న అతను మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2020లో 12 మ్యాచ్‌లు ఆడిన సూర్య కుమార్ యాదవ్ 40.22 యావరేజ‌్, 155.36 స్ట్రైక్ రేట్‌తో 362 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 79 నాటౌట్. మొత్తంగా 197 ఐపీఎల్ మ్యాచులు ఆడిన సూర్య 1906 రన్స్ చేశాడు.

English summary
With a huge talent Mumbai Indians star batsman Suryakumar Yadav should have earned a place in the Indian side longtime back said Kieron Pollard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X