తగ్గని కరోనా కేసులు - బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వ్యాప్తి తగ్గటం లేదు. కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 10,542 కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తంగా కేసుల సంఖ్య 4.48 కోట్లకు చేరింది. 0.14 శాతం కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,27,758) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రులు..పాఠశాలల్లో మాస్కలు తప్పని సరి చేసారు. కరనా సబ్ వేరియంట్ల కారణంగా కరోనా ఇన్ఫెక్షన్లు మరింతగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాల కంటే భిన్నంగా ఈ వేరియంట్ లో గర్తిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల తీవ్రత మరో వారం నుంచి పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 63,562 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,190 మంది మరణించారు. గత 24 గంటల్లో 8175 మంది కోలుకోగా, కొత్తగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానుంది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం 5 లక్షల డోసులను ప్రజలకు పంపిణీ చేయనుంది. రెండు డోసులుగా కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇచ్చింది. ఈ బూస్టర్ డోస్ లు రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో అందుబాటులో ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications