భ‌విష్య‌త్తులో మ‌రో 10 కొత్త వేరియంట్లు.. తెలంగాణ‌లో తొమ్మిదికి చేరిన ఒమిక్రాన్ కేసులు

తెలంగాణ‌లో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ కేసుల సంఖ్య 9కి చేరింది. ఒమిక్రాన్ వైర‌స్ సోకిన బాధితుల్లో 98 శాతం మందిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస‌రావు తెలిపారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

తొమ్మిది మందికి ఒమిక్రాన్

తొమ్మిది మందికి ఒమిక్రాన్

ఒమిక్రాన్ సోకిన వారంతా నాన్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చిన‌వారే అని శ్రీనివాస‌రావు తెలిపారు. హైద‌రాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేక‌రించిన న‌మూనాల్లో తొమ్మిది మందికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన‌ట్లు తేలింద‌ని తెలిపారు. అయితే వీరిలో ఎనిమిది మంది తెలంగాణ‌లోకి వ‌చ్చిన వారు కాగా మ‌రొక‌రు ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన బాలుడు అని చెప్పారు. అయితే ఆ బాలుడు ఎయిర్ట్ నుంచే నేరుగా ప‌శ్చిమ‌బెంగాల్ వెళ్లార‌ని పేర్కొన్నారు.

హ‌న్మ‌కొండ మ‌హిళ‌కు పాజిటివ్‌

హ‌న్మ‌కొండ మ‌హిళ‌కు పాజిటివ్‌


వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌కు చెందిన ఓ మ‌హిళ‌కు 8 రోజుల కింద‌ట క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన త‌ర్వాత ఒమిక్రాన్ సోకిన‌ట్లు నిర్ధ‌ర‌ణ అయింది. ఈమె ఈనెల 4న యూకే నుంచి వ‌చ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లాకు విదేశాల నుంచి 68 మంది వ‌చ్చారు . వారిలోని 50 మందికి కరోనా టెస్టులు నిర్వ‌హించ‌గా 49 మందికి నెగెటివ్ వ‌చ్చింది. వారిలోని ఒక మ‌హిళ‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమె శాంపిల్స్‌ను హైద‌రాబాద్ పంపించారు. ఆమెకు ఒమిక్రాన్ సోకిన‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. హ‌న్మ‌కొండ‌లో తొలి కేసు న‌మోదు కావ‌డంతో స్థానిక ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది.

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ఒమిక్రాన్ వేరియంట్‌లో భ‌యాందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. అయితే డెల్టా వేరియంట్ కంటే 8 రెట్లు ఎక్కువ‌గా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుంద‌న్నారు. కొవిడ్ రెండు టీకాలు వేయించుకున్న‌వారికి కూడా ఒమిక్రాన్ సోకుతుంద‌ని పేర్కొన్నారు. గ‌తంలో క‌రోనా వ‌చ్చిన వారికి సైతం కొత్త వేరియంట్ వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు. థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

మ‌రో 10 కొత్త వేరియంట్లు వ‌చ్చే అవ‌కాశం

మ‌రో 10 కొత్త వేరియంట్లు వ‌చ్చే అవ‌కాశం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ఇప్ప‌టికే 90 దేశాల‌కు పాకింది. ఈ వేరియంట్ సోకిన 95 శాతం మందిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డం లేదు. యూకేలో మాత్ర‌మే ఒక‌రు మ‌ర‌ణించారు త‌ప్పా ఎక్క‌డా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. దీనిపై ఎలాంటి భ‌యాందోళ‌న‌ల‌కు గురికావ‌ద్ద‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు. టీకాలు తీసుకోక‌పోవ‌డం కూడా ఒమిక్రాన్ వ్యాపికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. భ‌విష్య‌త్తులో మ‌రో 10 కొత్త వేరియంట్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+