శుభవార్త: స్మార్ట్‌కార్డ్‌‌పై మెట్రోలో 10% రాయితీ, పేటీఎం బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Paytm Offering Cash Back On Passengers Metro Card | Oneindia Telugu

  హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రో రైలులో స్మార్ట్‌కార్డ్‌తో ప్రయాణం చేసేవారికి ఛార్జీలో పది శాతం రాయితీని ఎల్ అండ్ టీ ప్రకటించింది.2018 మార్చి వరకు ఈ రాయితీని అందించనున్నట్టు ఎల్ అండ్ టీ కంపెనీ ప్రకటించింది.

  హైద్రాబాద్ మెట్రో రైలు: నో పార్కింగ్ ఏరియా, లిక్కర్‌ బాటిల్‌తో రైలులోకి

  హైద్రాబాద్ మెట్రో రైలును ప్రధాన మంత్రి మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ గత నెల 28వ, తేదిన ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణం చేసే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది.

  మెట్రోరైలు: పిల్లర్లతో అడ్రస్, జీపీఎస్, గూగుల్‌ మ్యాప్‌తో లింక్

  పలు రైల్వే స్టేషన్లలో పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అన్ని రైల్వే స్టేషన్లలో కూడ వాహనాల పార్కింగ్ వసతిని కల్పించేలా చర్యలు తీసుకొంటున్నారు.

  హైద్రాబాద్ మెట్రో‌రైలు: క్షణాల్లోనే గమ్యస్థానానికి, టీ సవారీ యాప్‌ ప్రత్యేకతలివే

  మెట్రోరైల్ షాక్: రూల్స్ బ్రేక్ చేస్తే 10 ఏళ్ళ జైలు, జరిమానా

   స్మార్ట్‌కార్డ్‌తో ప్రయాణం చేస్తే పది శాతం రాయితీ

  స్మార్ట్‌కార్డ్‌తో ప్రయాణం చేస్తే పది శాతం రాయితీ

  హైద్రాబాద్ మెట్రో రైలులో స్మార్ట్‌కార్డుతో ప్రయాణం చేసేవారికి ఛార్జీల్లో 10 శాతం రాయితీని కల్పించనున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది. డిసెంబర్ 7వ, తేది నుండి ఈ రాయితీ వర్తింపజేయనున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ 2018 మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని ఎల్ అండ్ టీ ప్రకటించింది. ప్రస్తుతం స్మార్ట్‌కార్డ్ ద్వారా ప్రయాణం చేసిన వారికి కేవలం 5 శాతం మాత్రమే రాయితీని ఇచ్చేవారు. కానీ, డిసెంబర్ 7వ, తేది నుండి పది శాతం రాయితీని అందిస్తున్నారు.

   రూ.200 స్మార్ట్‌కార్డ్ తీసుకోవాలి

  రూ.200 స్మార్ట్‌కార్డ్ తీసుకోవాలి

  రూ.200 చెల్లించి స్మార్ట్‌కార్డును తీసుకోవాలి. ఇందులో రూ.100 ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.3వేల వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఏడాదిపాటు ఈ కార్డు చెల్లుబాటవుతుంది. స్టేషన్లలోని టికెట్‌ కౌంటర్ల వద్ద వీటిని పొందవచ్చు.

   పేటీఎం ద్వారా రీఛార్జీ చేస్తే

  పేటీఎం ద్వారా రీఛార్జీ చేస్తే

  టీ-సవారీ యాప్‌; స్టేషన్లలోని యాడ్‌-వాల్యూ యంత్రాల ద్వారా కార్డులను రీఛార్జ్‌ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా తొలిసారి రూ.100, ఆపైన రీఛార్జ్‌ చేసుకుంటే రూ.20 క్యాష్ బ్యాక్ చేస్తున్నట్టు ఎల్‌అండ్‌టీ ప్రకటించింది.. ఇప్పటివరకు 1.70 లక్షల స్మార్ట్‌కార్డులను విక్రయించారు.

   మెట్రో ఛార్జీలిలా

  మెట్రో ఛార్జీలిలా

  నాగోలు నుండి మియాపూర్‌కు 27 కి.మీ దూరం. అయితే మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటే రూ.60 ఛార్జీ. స్మార్ట్‌కార్డ్ ఉంటే కేవలం రూ.54 మాత్రమే వసూలు చేస్తారు. మియాపూర్ నుండి సికింద్రాబాద్‌కు 18.9 కి.మీ. ఈ దూరానికి రూ.50 ఛార్జీ వసూలు చేస్తారు. స్మార్ట్ కార్డు ఉంటే కేవలం రూ45 మాత్రమే వసూలు చేస్తారు. అమీర్‌పేట నుండి నాగోల్‌కు 16.7 కి.మీ. దూరం. దీనికి రూ.45 ఛార్జీ, అయితే స్మార్ట్‌కార్డుంటే కేవలం రూ.40.5 వసూలు చేస్తారు. మియాపూర్ అమీర్‌పేటకు 11.3 కి.మీ దూరం అయితే దీనికి రూ.40 ఛార్జీ వసూలు చేస్తారు. స్మార్ట్‌కార్డ్ ద్వారా కేవలం రూ.36 వసూలు చేస్తారు. నాగోలు సికింద్రాబాద్ మధ్య8.7 కి.మీ దూరానికి రూ.35 చార్జీని వసూలు చేస్తారు.స్మార్ట్ కార్డు ద్వారా రూ.31.5 వసూలు చేస్తారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hyderabad Metro Rail project, has announced on Wednesday a 10% discount on all trips made through smart cards up to March 31, 2018. In addition, Paytm too is offering a flat ₹20 cash-back on first time recharge of ₹100 or more per card for passengers recharging their smart card through it.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి