త్వరలో 14వేల ఉద్యోగాలు.. నిరుద్యోగ మహిళలకు సీతక్క శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. అంగన్వాడి వ్యవస్థను బలోపేతం చేస్తే దిశగా అంగన్వాడీ హెల్పర్లు టీచర్ల నియామకాల పైన మంత్రి సీతక్క ముఖ్యమైన ప్రకటన చేశారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచే అంగన్వాడి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు.
అంగన్వాడీ ఉద్యోగాలపై మంత్రి సీతక్క ప్రకటన
మొత్తం అంగన్వాడీ సెంటర్లలో 14 వేలకు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. నియామకాలతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడుతుందని, చిన్నారులకు, గర్భిణీ మహిళలకు, బాలింతలకు అందే సేవలు మరింత మెరుగుపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హులు వీరే
ఇక అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత గ్రామాలకు చెందిన మహిళలుగా ఉండాలని సీతక్క అన్నారు. వారి నివాస ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని సీతక్క పేర్కొన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడిస్తోందని సీతక్క తెలిపారు.
వారికి నియామక పత్రాలు అందించి సీతక్క దిశా నిర్దేశం
నేడు టి జి పి ఎస్ సి ద్వారా కొత్తగా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను అందజేసిన క్రమంలో మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సూపర్వైజర్లకు నియామక పత్రాల అందుకున్న వారు ఒక్కొక్కరు 25 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని తెలిపారు.
దేశ భవిష్యత్తు అంగన్వాడి కేంద్రాల లోనే ఉందన్న సీతక్క
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వీరిపైన ఉందని, చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడమే కాకుండా, పౌష్టికాహారం అందించి తెలంగాణ రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో కీలక భూమిక పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు అంగన్వాడి కేంద్రాల లోనే ఉందని చెప్పిన మంత్రి సీతక్క మహిళా సాధికారతకు, శిశు సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
చిన్నారుల కోసం ఆ పని చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణా
మహిళా సాధికారతకు ఇందిరా గాంధీ బీజం వేశారని గుర్తు చేశారు. మహిళా శిశు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చిన్నారుల కోసం 57 రకాల ఆట వస్తువులను యూనిఫామ్ లను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.












Click it and Unblock the Notifications