వైయస్సార్ చనిపోయి రేపటికి 14 ఏళ్లు.!ఆయన ఇంకా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారన్న షర్మిళ.!

అచ్చంపేట/హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిళ మహాప్రస్ధానం పాద యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. 139వ రోజున జోరు వర్షంలో వైయస్ షర్మిళ అచ్చంపేట నియోజక వర్గంలో తన పాద యాత్రను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రశేఖర్ రావు చేసింది ఏమీ లేదని షర్మిళ విరుచుకుపడ్డారు. అంతే కాకుండా దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి శుక్రవారానికి 14సంవత్సరాలు పూర్తవుతాయని, తెలంగాణ ప్రజానీకం గుండెల్లో వైయస్ ఇంకా బతికే ఉన్నారన్నారు వైయస్ షర్మిళ.

Recommended Video

    కెసిఆర్ ప్రజల్ని ఇంకెంత మోసం చేస్తావ్- వై ఎస్ షర్మిల *Telangana | Telugu OneIndia
    గారడీ మాటల కేసీఆర్.. అచ్చంపేట పాదయాత్రలో కడిగేసిన షర్మిళ

    గారడీ మాటల కేసీఆర్.. అచ్చంపేట పాదయాత్రలో కడిగేసిన షర్మిళ


    అచ్చంపేట నియోజక వర్గంలోని బల్మూరు మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ షర్మిళకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ చనిపోయి శుక్రవారికి 14 ఏళ్లు పూర్తవుతుందని, అయినా ఇంకా వైఎస్సార్ ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారు వైయస్ షర్మిళ. వైఎస్సార్ రూపొందించిన పథకాలను ప్రజలు ఇంకా గుర్తుకు పెట్టుకున్నారన్నారు షర్మిళ. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పై పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచారని షర్మిళ స్పష్టం చేసారు. వ్యవసాయానికి ఎకరాకు 30 వేల లబ్ది పథకాలు అమలను చేసింది ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని షర్మిళ స్పష్టం చేశారు

    అన్ని వర్గాలను మోసం చేసిన కేసిన కేసీఆర్.. ధ్వజమెత్తిన వైయస్ షర్మిళ..

    అన్ని వర్గాలను మోసం చేసిన కేసిన కేసీఆర్.. ధ్వజమెత్తిన వైయస్ షర్మిళ..


    ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా సీఎం చద్రశేఖర్ రావు చేసింది ఏమిటని ప్రశ్నించారు, చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలను మోసం చేసారని, ఒక్క వర్గం కూడా బాగుపడలేదని, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు తెలంగాణలో పెరిగిపోయాయని మండి పడ్డారు. ఆడవాళ్ళ మీద హింసలు అధికమయ్యాయని, దేశంలో ఆడవారికి రక్షణ లేని రాష్ట్రంలో తెలంగాణ ఒకటిని ఆవేదన వ్యక్తం చేసారు. మైనర్ బాలికలు అని చూడకుండా రేప్ లు చేస్తున్నారని, హైదరాబాద్ నడి గడ్డ మీద మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే చర్యలు లేవని అసహనం వ్యక్తం చేసారు.

    బాద్యతలేని సీఎం.. గుణపాఠం చెప్పాలని షర్మిళ ప్రజలకు పిలుపు..

    బాద్యతలేని సీఎం.. గుణపాఠం చెప్పాలని షర్మిళ ప్రజలకు పిలుపు..


    అంతే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆడవారికి గౌరవం లేదని, కనీసం రక్షణ కూడా లేదని, ఆడవారి మాన ప్రాణాలను రక్షించలేని సీఎం ఉంటే ఎంత.? ఊడితే ఎంత.? అని సవాల్ విసిరారు. ఇలాంటి సీఎంలు ఉరి వేసుకొని సచ్చిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిళ. సున్నా వడ్డీలు అని ప్రజలను మోసం చేసారని, ఫీజు రీయింబర్స్మెంట్ అని మరో మోసం చేసారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతోనే కాకుండా నిరుద్యోగ భృతి పేరుతో పచ్చి మోసం చేసారని సీఎం పై షర్మిళ మండి పడ్డారు. అల్లుడు వస్తె ఎక్కడ ఉంటాడు అని డబుల్ బెడ్ రూం అన్నాడని, పాపం చంద్రశేఖర్ రావు సీఎం కాకముందు తెలంగాణలో పెళ్ళిళ్ళు కానట్లు... అల్లుడు వస్తే ఎక్కడా పడుకొనట్లు అని ఎద్దేవా చేసారు షర్మిళ.

    తాను వైఎస్సార్ బిడ్డ.. పులి కడుపున పులే పుడుతుందన్న షర్మిళ..

    తాను వైఎస్సార్ బిడ్డ.. పులి కడుపున పులే పుడుతుందన్న షర్మిళ..


    తెలంగాణలో చంద్రశేఖర్ రావు కోటేశ్వరుడు అయ్యాడని, అచ్చంపేట ఎమ్మెల్యే కోటీశ్వరుడు అయ్యాడని షర్మిళ మండి పడ్డారు. 60 ఏళ్ల పై బడిన రైతుకు ఎందుకు భీమా ఇవ్వరని, రైతు ప్రాణాలకు విలువలేదా?అని ప్రశ్నించారు. తెలంగాణ లో 8 ఏళ్లుగా చంద్రశేఖర్ రావు మాట మీద నిలబడలేదని, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నాయని ఎద్దేవా చేసారు. బీజేపీ,కాంగ్రెస్ లు సైతం ప్రజల కోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాలకొసమే రాజకీయం చేస్తున్నాయన్నారు. తాను వైఎస్సార్ బిడ్డ అని, పులి కడుపున పులే పుడుతుందన్నారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అమలు చేస్తామని, వైఎస్సార్ సంక్షేమ పాలనను బ్రహ్మాండంగా తీసుకొస్తానని, ఈ తెలంగాణ గడ్డ అభివృధి కోసం నిలబడతానన్నారు షర్మిళ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+