తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు: 10 మరణాలు, ‘గాంధీ’ సిబ్బంది నిరవధిక సమ్మె

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం మొత్తం రాష్ట్రంలో 1524 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37,745కు చేరింది. రాష్ట్రంలో 12,531 యాక్టివ్ కేసులున్నాయి.

కాగా, గత 24 గంటల్లో 1161 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 24,840కు చేరింది. ఇక మంగళవారం మరో 10 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 375కి చేరింది.

 1524 new corona positive cases recorded in Telangana: 10 new deaths

మంగళవారం గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 815 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 240 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 97 కరోనా కేసులు, సంగారెడ్డి జిల్లాలో 61 కేసులు నమోదయ్యాయి.

కాగా, మంగళవారం తెలంగాణలో 13,175 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1524 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,95,024కు చేరింది. మంగళవారం 11,654 ఫలితాలు నెగిటివ్‌గా తేలాయి.

గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిరవధిక సమ్మె

గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. జులై 15 నుంచి నిరవధికంగా సమ్మె చేస్తామని సీఐటీయూ సభ్యుడు కుమార్ తెలిపారు. జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+