తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, యాక్టివ్ కేసుల్లో క్షీణత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, మరోసారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 32,828 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది. అయితే, కరోనా పరీక్షల సంఖ్య కూడా భారీగా తగ్గింది.
తాజాగా, నమోదైన 162 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,66,546కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3921గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 886 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,58,170కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4455 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 02, జీహెచ్ఎంసీలో 63. జగిత్యాలలో 01, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 13, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 00, మంచిర్యాలలో 09, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 07, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 10, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 03, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 05, సూర్యాపేటలో 03, వికారాబాద్ లో 01, వనపర్తిలో 03, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 09, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నిర్మల్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 22,842 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. నిన్నటితో పోల్చితే (24,354) తక్కువగా కావడం గమనార్మం. మరోవైపు మరణాలు 250లోపే నమోదయ్యాయి. ఇక కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. దేశంలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో 13,217 కేసులు.. 121 మరణాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
Recommended Video
గడిచిన 24 గంటల్లో దేశంలో 22,842 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. శనివారం 244 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,817కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 25,930 మంది కరోనాను జయించగా.. ఇప్పటివరకూ 3,30,94,529 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 199 రోజుల కనిష్ఠానికి తగ్గి 2,70,557కి చేరింది.












Click it and Unblock the Notifications