తెలంగాణలో కొత్తగా 1802 కరోనా పాజిటివ్ కేసులు..9 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు రోజూ వేల సంఖ్యలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మెరుగుపడుతోంది. తాజాగా నమోదైన డిశ్చార్జిల సంఖ్య లక్ష మార్క్‌ను అందుకుంది. ఒకవంక కరోనా కేసుల వెల్లువ కొనసాగుతున్న సమయంలో.. దానికి అనుగుణంగా కోలుకున్న వారి సంఖ్య కూడా నమోదు కావడం ఊరట కలిగించే అంశం. కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. రోజూ 10కి అటు ఇటుగా మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు.

Recommended Video

    COVID-19: Telangana లో విజృంభిస్తున్న Corona.. 70% కేసులు దాచి పెడుతున్న ప్రభుత్వం!| Oneindia Telugu

    తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా1802 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9 మంది మరణించారు. 2711 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య లక్షను దాటేసింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,42, 771కు చేరుకుంది. ఇందులో 1,10,241 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 895కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 31,635గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 24,596 మంది చికిత్స పొందుతున్నారు.

    1802 new Corona positive cases and 9 deaths reported in the last 24 Hours in Tealngana

    గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 245 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. కొత్త కేసులు 158కు పైగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-16, భద్రాద్రి కొత్తగూడెం-49, జగిత్యాల-73, జనగామ-30, జయశంకర్ భూపాలపల్లి-1, జోగుళాంబ గద్వాల-17, కామారెడ్డి-46, కరీంనగర్-136, ఖమ్మం-64, కొమరంభీమ్ ఆసిఫాబాద్-13, మహబూబ్ నగర్-40, మహబూబాబాద్-63, మంచిర్యాల-64, మెదక్-19, మేడ్చల్ మల్కాజ్‌గిరి-65, ములుగు-11, నాగర్ కర్నూలు-29, నల్లగొండ-79, నారాయణపేట్-2, నిర్మల్-14, నిజామాబాద్-94, పెద్దపల్లి-32, రాజన్న సిరిసిల్ల-20, రంగారెడ్డి-158, సంగారెడ్డి-103, సిద్ధిపేట్-106, సూర్యాపేట్-62, వికారాబాద్-12, వనపర్తి-25, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-93, యాదాద్రి భువనగిరి-29 కేసులు నమోదు అయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+