Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈటల రాజేందర్ హత్యకు 20కోట్ల డీల్..ఈటల జమున షాకింగ్ వ్యాఖ్యలు!!

హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 కోట్లు పెట్టి ఈటల రాజేందర్ ను చంపించడానికి కుట్ర జరుగుతుందని ఈటల జమున షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ను చంపేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెబుతున్నారంటే అది కెసిఆర్ అండతోనేనని ఆమె మండిపడ్డారు.

నీతో చంపించడానికేనా మేము తెలంగాణ ఉద్యమం చేసింది అంటూ ఈటల జమున ప్రశ్నించారు. ఏదైనా చెబితే వినకపోతే చంపడానికి కూడా కేసీఆర్ రెడీ అవుతున్నారని అనుకోవాలా అంటూ ఈటల జమున నిలదీశారు. తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీతో అయినా కెసిఆర్ ను ఓడించడం సాధ్యమేనని ఆమె పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా సంతృప్తిగా ఉన్నారని ఆయన ప్రజల కోసమే పని చేస్తారన్నారు.

eatalarajenderandjamuna

ఎవరి కోసం తమకు ప్రాకులాట లేదని, కాళ్ళు మొక్కడం తమ రక్తంలోనే లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని పేర్కొన్న ఆమె, ఈటల రాజేందర్ కు అండగా ఉంటానని, పరోక్షంగానే తన మద్దతు తెలుపుతానని పేర్కొన్నారు. ఇక ఈటల రాజేందర్ ప్రతిష్ట దిగజారిందని, మెప్పుకోసం ఏదేదో మాట్లాడుతున్నారని వాట్సప్ లో మెసేజ్ లు పెడుతున్నారన్మంనారు.

ఈటల రాజేందర్ ప్రతిష్ట ఎప్పుడు దిగజారదని, ఆయన ఉద్యమకారుడు అని స్పష్టం చేశారు. ప్రజలు తమను కాపాడుకుంటామని, తాము ఏనాడూ లంగ, దొంగ పనులు చేయలేదని స్పష్టం చేశారు. చిల్లరగాళ్ళు ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ గురించి, తన గురించి ఏదేదో మాట్లాడారని ప్రజలే వారికి బుద్ధి చెప్పారన్నారు.

eatalarajender

ఇక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై మండిపడిన ఈటల జమున చిల్లర పిచ్చికుక్కను ఎమ్మెల్సీ చేసి హుజురాబాద్ మీదకు కెసిఆర్ వదిలి పెట్టారన్నారు. 2014లో కట్టిన అమరవీరుల స్థూపం మీద ఆయన పేరు లేదని కూల్చి వేశారని, అటువంటి వ్యక్తికి అమరవీరుల స్తూపం తాకే హక్కు లేదన్నారు. తమ మీద అక్కసుతోనే కెసిఆర్ ఇదంతా చేస్తున్నారని ఈటల జమున మండిపడ్డారు.

తమను ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెడుతున్నారని, అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రక్షణ ఉండదని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మహిళలందరూ కలిసి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. నా ఇంట్లో నా భర్త పిల్లలు ఎవరి రక్తం బొట్టు పడినా కేసీఆర్ దే బాధ్యత అని ఈటల జమున తేల్చిచెప్పారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+