సంక్రాంతికి 200 కొత్త బస్సులు: అద్దెకు మరిన్ని కావాలంటూ టీఎస్ఆర్టీసీ ప్రకటన

హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది.

హైదరాబాద్‌‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్‌ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

200 new buses for Sankranthi festival; TSRTC MD Sajjanar

'ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం' అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తెలిపారు.

ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఉందని సజ్జనార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

200 new buses for Sankranthi festival; TSRTC MD Sajjanar

బస్సులు అద్దెకు కావాలంటూ టీఎస్ఆర్టీసీ ప్రకటన

ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో ప్రజా రవాణాకు ఉపయోగకరంగా ఉండే బస్సులు అద్దెకు తీసుకుంటామని పత్రికా ప్రకటన విడుదల చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ ఆర్టీసీకి అత్యవసరంగా అద్దెబస్సులు అవసరమని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ బస్సులను ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వొచ్చని తెలిపారు.

ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటి సబర్బన్, సిటి మఫిసిల్ బస్సులు అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ టెండర్ కు సిద్దంగా ఉన్న వారు బస్సులకు సంబంధించిన నమూనా, రంగు, మోడల్, అద్దె రేట్లు, కాషన్ డిపాజిట్, వీల్ బేస్, సీటింగ్ సామర్థ్యం, బస్సు బాడీ ప్రమాణాలు, సిట్టింగ్ కెపాసిటీ తదితర వివరాలను దరఖాస్తులో పొందుపరచాలని ఆర్టీసీ తన ప్రకటనలో పేర్కొంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ ఆర్టీసీ అధికార వెబ్‌సైట్ http://tsrtc.telangana.gov.inను సందర్శించాలని కోరింది. అలాగే 9100998230 నంబరుకు సంప్రదించవచ్చని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+