హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు: టెస్టులు కూడా తగ్గాయి!, జిల్లాలవారీగా కేసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నాటి నుంచి కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా.. 2242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,53,277కి చేరింది.

Recommended Video

#TOPNEWS: Congo Volcano Eruption | Oneindia Telugu

తాజాగా మరో 19 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3125కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో 4693 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,09,663కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 92.11 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులున్నాయి.

 2242 new corona cases and 19 deaths reported in telangana last 24 hours

జిల్లాల వారీగా తాజా క‌రోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్‌-11, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-42, జీహెచ్ఎంసీ-343, జ‌గిత్యాల‌-71, జ‌న‌గాం-16, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-20, జోగులాంబ గ‌ద్వాల‌-63, కామారెడ్డి-12, క‌రీంన‌గ‌ర్‌-165, ఖ‌మ్మం-123, కొమురంభీం ఆసిఫాబాద్‌-13, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-134, మ‌హ‌బూబాబాద్‌-57, మంచిర్యాల‌-46, మెద‌క్‌-20, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-146, ములుగు-16, నాగ‌ర్‌క‌ర్నూలు-57, న‌ల్ల‌గొండ‌-32, నారాయ‌ణ‌పేట‌-23, నిర్మ‌ల్‌-7, నిజామాబాద్‌-30, పెద్ద‌ప‌ల్లి-50, రాజ‌న్న సిరిసిల్ల‌-28, రంగారెడ్డి-174, సంగారెడ్డి-83, సిద్దిపేట‌-94, సూర్యాపేట‌-63, వికారాబాద్‌-87, వ‌న‌ప‌ర్తి-55, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-61, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-87, యాదాద్రి భువ‌న‌గిరి-13 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా, లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోనివారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఉదయం 10 తర్వాత వచ్చే వాహనాలను సరిహద్దులోనే నిలిపివేస్తున్నారు. దీంతో ఆక్కడే భారీగా వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి.

English summary
2242 new corona cases and 19 deaths reported in telangana last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X