Telangana: రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు..
తెలంగాణలో భారీగా ప్రభుత్వ అధికారుల బదిలీలు జరిగాయి. త్వరలో లోక్ సభ ఎన్నికలున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయి. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువు అధికారులకు బదిలీలతో పాటు ప్రమోషన్లు కూడా ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ కూడా ఇచ్చింది.
రాష్ట్రంలో 132 మంది ఎమ్మార్వోలు బదిలీ చేశారు. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఎమ్మార్వోలను బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఒకే చోట మూడేళ్లు పని చేస్తున్నవారిని.. సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

త్వరలో ఐఏఎస్ లు, ఏపీఎస్ ల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి మూడో వారంలో వచ్చే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికలు కూడా ఏప్రిల్ లోనే జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుంచి 19 వరకు 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటీ పడనున్నాయి. అయితే తాజాగా ఆప్ తాము సొంతగా పోటీ చేస్తున్నట్లు ప్రటించింది. ఇక బీఆర్ఎస్ కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తురన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలో దిగాలని చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications