సూపర్ మార్కెట్‌లో ఫ్రిడ్జ్‌ని ముట్టుకోవడంతో విద్యుత్ షాక్, చిన్నారి మృతి (వీడియో)
నిజామాబాద్: తండ్రితో సరదాగా సూపర్ మార్కెట్ వెళ్లిన ఓ నాలుగేళ్ల చిన్నారి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సూపర్ మార్కెట్లోని ఓ ఫ్రిడ్జిని ముట్టుకోగానే విద్యుత్ షాక్ కొట్టడంతో ఆ చిన్నారి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట పట్టణంలోని ఎన్ సూపర్ మార్కెట్లో చోటు చరేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండల కేంద్రానికి చెందిన రాజశేఖర్, సంయుక్తలకు రిషిత రెండో సంతానం. బంధువుల ఇంటికి ఓ పూజా కార్యక్రమానికి వెళ్లారు. పూజ సామాగ్రి కొనేందుకు తండ్రి, కుమార్తె కలిసి సూపర్ మార్కెట్ కు వెళ్లారు. రిషితకు ఐస్ క్రీమ్ తీసుకునేందుకు రాజశేఖర్ ఫ్రిజ్ వద్దకు వెళ్లారు.

అప్పుడే రిషిత కూడా అక్కడేవున్న మరో ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి డోర్ ముట్టుకోవడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన వెంటనే తండ్రి.. తన కుమార్తెను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రిషిత తల్లిదండ్రులు, బంధువులు పాప మృతికి కారణమైన సూపర్ మార్కెట్ ఎదుట మృతదేహంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపర్ మార్కెట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
A four-year-old baby Rishita died of electric shock upon opening the door of a refrigerator in “N” supermarket in Nizamabad. She accompanied her father Rajasekhar of Navipet in Nandipet of Nizamabad. She died of electric shock instantly. @newstapTweets pic.twitter.com/ikTaF2q57R
— Saye Sekhar Angara (@sayesekhar) October 2, 2023
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. రిషిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చిన్నారి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను విరమించారు. అయితే, ఫ్రిడ్జ్ పట్టుకుంటే విద్యుత్ షాక్ రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications