ఘోరం: తండ్రి మరణం తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగర పరిధిలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంటి యజమాని మృతి చెందితే, భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య, తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇద్దరు కుమార్తెలు, కుమారుడు క్షణికావేశంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కుటుంబంలోని ఐదుగురూ మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌లో హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ రెండు నెలలుగా సిక్ లీవ్‌లో కొనసాగుతున్నారు.

సత్యనారాయణకు భార్య మీరా (50), కూతుర్లు స్వాతి (33), నీలిమ (29), కుమారుడు శివరామకృష్ణ (22)లు ఉన్నారు. అయితే, గత రెండు మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్ద కుమార్తెను హన్మకొండలోని అమ్మమ్మ వద్ద, చిన్న కూతురు, కొడుకును హైదరాబాద్‌లోని వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. వీరు ముగ్గురూ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

కాగా, శుక్రవారం సాయంత్రం సత్యనారాయణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు సొంత కారు (టిఎస్01 ఈఈ 6165)లో కుటుంబమంతా బయలు దేరారు. అప్పటికే రాత్రి కావడంతో భువనగిరి సమీపంలోని వివేరా హోటల్‌లో డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలు దేరారు. బీబీనగర్ సమీపంలోకి రాగానే సత్యనారాయణ కారులోనే హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

తామెందుకు బతకాలంటూ వేదనకు గురయ్యారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపైవున్న అంకుషాపూర్ హెచ్‌పిసిఎల్ కంపెనీ వద్దకు రాగానే పక్కనే రైలు పట్టాలు కనిపించాయి. దీంతో మూకుమ్మడిగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. రైలు పట్టాలకు సమీపంలో తమ కారును సత్యనారాయణ మృతదేహంతో పాటు నిలిపారు.

తల్లి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైలు మార్గంలోని పట్టాలపై పడుకున్నారు. రైలు వేగంగా రావడంతో నలుగురి తలలు, శరీర భాగాలు పట్టాలకు ఇరువైపుల వేర్వేరుగా పడ్డాయి. తల్లి మీరా, కూతురు స్వాతీల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. రాత్రి సమయంలో కారు రైలు పట్టాల సమీపంలో ఉండటంతో రాత్రి పూట గస్తీ తిరుగుతున్న పోలీసులు చూసి ఎవరో నిలిపి ఉంటారని వెళ్లి పోయారు.

శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు పోలీసులు మరల చూసే సరికి కారు అక్కడే ఉంది. దీంతో అనుమానంతో పోలీసులు కారు వద్దకు వెళ్లి చూడగా.. కారులో మృతుడు సత్యనారాయణ మృతదేహం మాత్రమే ఉంది. దీంతో చుట్టు పక్కల వెతికి చూడగా ఎవరూ కనిపించక పోవటంతో రైలు పట్టాల వద్దకు వెళ్లి పరిశీలించారు. రైలు పట్టాలపై నాలుగు మృత దేహాలు పడి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

కారులో పరిశీలించగా వారికి సంబంధించిన వివరాలు, ఆధారాలు లభ్యం కావటంతో మృతుల బంధువులకు సమాచారం అందించారు. రైల్వే డిసిపి జగదీషప్ప, ఇన్‌స్పెక్టర్ అంజనేయులు, మల్కాజిగిరి డిసిపి రాంచంద్రారెడ్డి, ఏసిపి రవిచందన్‌రెడ్డి, ఘట్‌కేసర్ సిఐ ప్రకాష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఐదుగురు మృతి చెందడం అక్కడి వారిని కలిచివేసింది.

పెను విషాదం

పెను విషాదం

హైదరాబాద్ నగర పరిధిలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంటి యజమాని మృతి చెందితే, భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య, తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇద్దరు కుమార్తెలు, కుమారుడు క్షణికావేశంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పెను విషాదం

పెను విషాదం

శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలోని ఐదుగురూ మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

పెను విషాదం

పెను విషాదం

వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌లో హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ రెండు నెలలుగా సిక్ లీవ్‌లో కొనసాగుతున్నారు. సత్యనారాయణకు భార్య మీరా (50), కూతుర్లు స్వాతి (33), నీలిమ (29), కుమారుడు శివరామకృష్ణ (22)లు ఉన్నారు.

పెను విషాదం

పెను విషాదం

శుక్రవారం సాయంత్రం సత్యనారాయణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు సొంత కారు (టిఎస్01 ఈఈ 6165)లో బయలు దేరారు. అప్పటికే రాత్రి కావడంతో భువనగిరి సమీపంలోని వివేరా హోటల్‌లో డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలు దేరారు.

పెను విషాదం

పెను విషాదం

బీబీనగర్ సమీపంలోకి రాగానే సత్యనారాయణ కారులోనే హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

పెను విషాదం

పెను విషాదం

తామెందుకు బతకాలంటూ వేదనకు గురయ్యారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపైవున్న అంకుషాపూర్ హెచ్‌పిసిఎల్ కంపెనీ వద్దకు రాగానే పక్కనే రైలు పట్టాలు కనిపించాయి. దీంతో మూకుమ్మడిగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

పెను విషాదం

పెను విషాదం

రైలు పట్టాలకు సమీపంలో తమ కారును సత్యనారాయణ మృతదేహంతో పాటు నిలిపారు. తల్లి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైలు మార్గంలోని పట్టాలపై పడుకున్నారు.

పెను విషాదం

పెను విషాదం

రైలు వేగంగా రావడంతో నలుగురి తలలు, శరీర భాగాలు పట్టాలకు ఇరువైపుల వేర్వేరుగా పడ్డాయి. తల్లి మీరా, కూతురు స్వాతీల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five members of a family committed suicide on Saturday in Ranga Reddy district near Hyderabad, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి