హైదరాబాద్ పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం కీలక నిర్ణయం: అదనంగా 500
హైదరాబాద్: నగరంలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, పాస్ పోర్ట్ ఆఫీస్ సేవా కేంద్రాల్లో కొత్త పాస్ పోర్టుల కోసం, పాస్‌పోర్టుల రెన్యూవల్ కోసం వచ్చే వినియోగదారులకు ఊరట లభించనుంది. ఏప్రిల్ 27 నుంచి రెండు వారాలపాటు ఎప్పుడూ ఇచ్చే రోజువారీ పాస్‌పోర్ట్ అప్పాయింట్‌మెంట్స్ అదనంగా.. మరో 500 అప్పాయింట్‌మెంట్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం హెడ్ దాసరి బాలయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 27కు సంబంధించిన 500 అదనపు అప్పాయింట్‌మెంట్స్.. పాస్‌పోర్టు సేవా వెబ్‌సైట్‌లో మంగళవారం సాయంత్రం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పాస్‌పోర్టు ఆఫీస్ సేవా కేంద్రాలను మూసి ఉంచారు.

దీంతో ఆ రోజు అప్పాయింట్‌మెంట్స్ తీసుకున్నవారు సేవలను పొందలేకపోయారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో వినియోగదారుల రద్దీ భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. కాబట్టి ఇప్పటికే పాస్‌పోర్టుల కోసం రిజిస్టర్ చేసుకున్నవాళ్లు, చేసుకుంటున్న వాళ్లు ఈ అదనపు 500 అప్పాయింట్‌మెంట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దాసరి బాలయ్య కోరారు.
www.passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా mPassportseva మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (PSKs), పాస్‌పోర్టు ఆఫీస్ సేవా కేంద్రాల్లో (POSKs) నేరుగా సంప్రదించడం ద్వారా అదనపు 500 అప్పాయింట్‌మెంట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతుండటంతో పాస్ పోర్ట్ కార్యాలయల వద్ద పాస్ పోర్టు సేవలను వినియోగించుకుునేవారి బారులు కూడా పెరుగుతున్నాయి. దీంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications