సేఫ్టీ: ఉత్సాహంగా సాగిన విద్యార్థుల 5కె రన్(పిక్చర్స్)
హైదరాబాద్: ఎంవిఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్డులో ‘రోడ్డు భద్రతపై 5కె రన్' నిర్వహించారు. ఈ పరుగును కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ..నగరంలో ఎంతగా రోడ్లను విస్తరిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. యువత జీవితం దేశానికి చాలా అవసరమని, హెల్మెట్స్, సీటు బెల్టులు పెట్టుకోవటం నామోషీగా భావించొద్దని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని అన్నారు.
మంత్రి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ని స్మార్ట్ సిటీగా మలిచే క్రమంలో సిగ్నల్స్ లేని కూడళ్లను రూపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైౖర్మన్ ఎంవీ శ్రీధర్, ఉపాధ్యక్షులు కృష్ణ కుమార్, ప్రిన్సిపాల్ శాసి్త్ర తదితరులు పాల్గొన్నారు. కాగా, పరుగు అసాంతం ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు పరుగును విజయవంతంగా పూర్తి చేశారు.

5కె రన్
ఎంవిఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్డులో ‘రోడ్డు భద్రతపై 5కె రన్' నిర్వహించారు.

5కె రన్
ఈ పరుగును కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు.

5కె రన్
ఈ సందర్భంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ..నగరంలో ఎంతగా రోడ్లను విస్తరిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.

5కె రన్
యువత జీవితం దేశానికి చాలా అవసరమని, హెల్మెట్స్, సీటు బెల్టులు పెట్టుకోవటం నామోషీగా భావించొద్దని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని అన్నారు.

5కె రన్
మంత్రి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ని స్మార్ట్ సిటీగా మలిచే క్రమంలో సిగ్నల్స్ లేని కూడళ్లను రూపొందిస్తున్నామని అన్నారు.

5కె రన్
ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైౖర్మన్ ఎంవీ శ్రీధర్, ఉపాధ్యక్షులు కృష్ణ కుమార్, ప్రిన్సిపాల్ శాసి్త్ర తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications