ఘోర రోడ్డు ప్రమాదం .. రక్తమోడిన ఓఆర్ఆర్ .. ఆరుగురు మృతి
హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ రక్తమోడింది . మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు తీసింది. భయంకరంగా జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి. ముగ్గురు తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్ ప్రమాదం ... ఆరుగురు స్పాట్ డెడ్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి గ్రామం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురి ప్రాణాలు తీసింది. గుర్తుతెలియని వాహనం ముందున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన కొందరు బొలెరో వాహనంలో హైదరాబాద్ నుంచి పటాన్ చెరువు వైపు ఔటర్ రింగ్ రోడ్ లో వెళ్తున్నారు. వారి వాహనం పాటి గ్రామానికి చేరేసరికి వెనక నుండి అతి వేగంగా వచ్చిన మరో వాహనం బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ఓ ఆర్ ఆర్ పాటిగ్రామం వద్ద ప్రమాదం .. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలు
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు .మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోడ్డు ప్రమాదం పటాన్చెరువు ఇన్చార్జి డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఓ ఆర్ ఆర్ పాటిగ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనంలో మొత్తం 9 మంది ప్రయాణం చేస్తున్నారని, ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

బొలెరో వాహనాన్ని వెనుక నుండి వేగంగా డీ కొట్టిన మరో వాహనం
ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని డీఎస్పీ పేర్కొన్నారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పిన డి.ఎస్.పి ఈ వాహనాన్ని డీ కొట్టిన మరో వెహికల్ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.ముందు వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు .అయితే బొలెరో వాహనం డ్రైవ్ చేస్తుంది ఎవరు అనేది తెలియాల్సి ఉందన్నారు. అందరూ తీవ్ర గాయాల పాలు కాగా వీరి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications