క్రికెట్ బంతి తగిలి హైద్రాబాద్‌లో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల క్రికెట్ ఆట ఆడుతూ పలువురు మృతి చెందడం, గాయాలపాలవుతుండటం తెలిసిందే. తాజాగా వనస్థలిపురంలో మరో సంఘటన జరిగింది.
వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో గురువారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా వంశీకృష్ణ అనే ఆరేళ్ల చిన్నారి గాయపడ్డాడు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వంశీకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వంశీకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సహారా ఎస్టేట్‌లో విషాదం అలుముకుంది.

కాగా, క్రికెట్ ఆడుతూ ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అంకిత్ కేసరి అనే యువకుడు మృతి చెందాడు. గత శుక్రవారం ఓ బంతిని క్యాచ్ పట్టబోతూ మరో ఆటగాడిని గుద్దుకున్నాడు. అతనికి తీవ్ర గాయమైంది. అతనిని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం అతను మృతి చెందాడు.
ఆ తర్వాత రోజునే రాహుల్ ఘోష్ అనే మరో ఆటగాడు గాయపడ్డాడు. వీడియోకాన్ క్రికెట్ అకాడమీ వేదికగా విజయ్ స్పోర్టింగ్, కోల్‌కతా పోలీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ ఘోష్ (20) గాయపడ్డాడు. అతని పరిస్ధితి క్రమంగా మెరుగవుతోందని, అతడు కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications