రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్
గోదావరిఖని: రామగుండంలో మూతపడ్డ బీ పవర్ హౌస్ 62.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థానంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్కో జాయింట్‌గా పవర్ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని, భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరామని డిప్యటీ సీఎం చెప్పారు.
శనివారం రామగుండంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీ పవర్ హౌస్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు బి పవర్ హౌస్ గురించి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన పవర్ ప్రాజెక్టు 50 ఏళ్ల క్రితం ఏర్పడి ఈ ప్రాంతానికి వెలుగునిచ్చిందని తెలిపారు.

సాగునీటిని కూడా తీసుకువచ్చిన ప్రాజెక్టు.. కాలం చెల్లడంతో మూసివేసే పరిస్థితికి వచ్చిందని డిప్యూటీ సీఎం అన్నారు. భావోద్వేగమైన పరిస్థితులతో ముడిపడి ఉన్న పవర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు చర్చించామని తెలిపారు. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి, జెన్కో సంయుక్త వెంచర్‌గా పవర్ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు.

గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్: శ్రీధర్ బాబు
గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరిఖనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తో కలిసి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రూ. 8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.
రామగుండంలోని 800 మెగా వాట్ల టీజీ విద్యుత్ ప్లాంట్ స్థలం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి @Bhatti_Mallu గారితో కలిసి సందర్శించడం జరిగింది.
— Sridhar Babu Duddilla (@OffDSB) August 31, 2024
అనంతరం సెక్టార్ 2 వద్ద 3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తో కలిసి ప్రారంభించడం జరిగింది
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్… pic.twitter.com/zaNuzlOoHI
ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనన చేశామన్నారు. అంతేగాక, రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని, దీని కోసం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంతో కృషి చేశారన్నారు శ్రీధర్ బాబు. వచ్చే ఏడాది వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ ను అభివృద్ది చేస్తామని మంత్రి వివరించారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications