తెలంగాణలో విజృంభిస్తున్న కరోనావైరస్: 800కుపై కొత్త కేసులు, హైదరాబాద్‌లోనే అత్యధికం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38, 122 నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 836 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 443 కొత్త కేసులు వచ్చాయి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 52 కేసులు, కరీంనగర్ జిల్లాలో 35 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 29 కేసులు, నల్గొండ జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 765 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించకపోవడం ఊరటనిచ్చే విషయం.

 836 new coronavirus cases reported in telangana in last 24 hours

రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,17,367 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8,08,270 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,986కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 36, 764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 852 మందికి పాజిటివ్ గా తేలింది.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు అందరూ తప్పనిసరిగా ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని పేర్కొంది. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉండటంతో పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+