Heart Attack: గుండె పోటుతో 12 ఏళ్ల బాలిక మృతి..

ఈ మధ్యలో చాలా గుండె పోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ముఖ్యంగా పిల్లలు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.

12 ఏళ్ల అదరంగి మైథిలి దసరా సెలవులకు ఇంటికివచ్చిన రోజే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మికి గ్రెసీ, మైథిలి ఇద్దరు కుమార్తెలు. సాంఘిక సంక్షేమ గురుకులంలోనే గ్రెసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మైథిలి ఏడో తరగతి చదువుతున్నారు.

A 12-year-old girl died of a heart attack in Mopal, Nizamabad district

బతుకమ్మ సెలవు కావడంతో శుక్రవారం మైథిలి ఇంటికి వచ్చింది. సాయంత్రం వరకు ఆడుకుంటూ కనిపించిన బాలిక రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. దీంతో మైథిలిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని వైద్యులు చెప్పారు. శనివారం గ్రామంలో బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి తరగతిలో కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించలోగానే ప్రాణాలు విడిచింది. విద్యార్థిని గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

బాలిక గుండెపోటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతురాలు రిద్ధి మేవాడ గోదాదర ప్రాంతంలో ఉన్న గీతాంజలి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రిద్ధి మొదటి బెంచీలో కూర్చుని ఉండగా.. ఆ సమయంలోఉపాధ్యాయురాలు పాఠం చెబుతున్నారు. బాలిక ఒక్కసారిగా కుప్పకూలి, బెంచీపై నుంచి కిందపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సెప్టెంబర్ 25 న, జామ్‌నగర్‌లోని ఒక తరగతిలో గర్బా డ్యాన్స్ స్టెప్పులు రిహార్సల్ చేస్తూ 19 ఏళ్ల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

అంతకు ముందు సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడి వయస్సు 25 ఏళ్ల లోపే ఉంటుంది. మరో ఘటనలో ఓ వ్యక్తి హల్ది ఫంక్షన్ కు హాజరయ్యాడు. పెళ్లి కొడకుకు పసుపు రాసేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపే అతని కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. కొద్ది రోజుల చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు హైదరాబాద్ లాలాపేటలో ఓ వ్యక్తి షటిల్ ఆడుతూ కిందపడిపోయాడు. అతను గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+