నమ్మి పంపిస్తే.. రూ. 7 కోట్ల బంగారంతో ఉడాయించిన డ్రైవర్!

హైదరాబాద్: నగరంలో ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది. యజమాని కారులో ఉన్న బంగారంతో డ్రైవర్ పరారయ్యాడు.

హైదరాబాద్: నగరంలో ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది. యజమాని కారులో ఉన్న బంగారంతో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో బంగారం అమ్మకందారైన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కావడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు రెండు వైపులా దర్యాప్తు జరుపుతున్నారు.

ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అనూష రూ. 50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ చేశారు. ఆమె శుక్రవారం సాయంత్రం మధురాగనర్‌లో బంధువుల ఇంట్లో ఉన్నారు. తాను ఆర్డర్ చేసిన నగరలను అక్కడికే పంపమని చెప్పడంతో.. రాధిక తన కారులో డ్రైవర్ శ్రీనివాస్(28), సేల్స్‌మెన్ అక్షయ్(30)లతో వాటిని పంపారు.

A car driver theft Rs 7 crore gold ornaments from his owner

మధురానగర్‌కు చేరుకున్నాక డ్రైవర్ కారులోనే ఉండగా.. అక్షయ్ ఇంట్లోకి వెళ్లి నగలను అనూషకు ఇచ్చి వెనుదిరిగారు. ఈలోపు డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా పరారయ్యాడు. అయితే, కారులో సిరిగిరి రాజ్ జేమ్స్ అండ్ జ్యువెల్లర్స్ కు తిరిగి ఇవ్వాల్సిన రూ. 7 కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాధిక ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో చోరీ జరగ్గా.. రాత్రి 11 గంటల సమయంలో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే, చోరీకి గురైన బంగారు వజ్రాభరణాలకు సంబంధించిన బిల్లులు కూడా లేవని వారు పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. దీంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+