తాగిన మైకంలో భార్యకు ఉరేసి చంపాడు: పిడుగుపాటుతో ముగ్గురు మహిళల మృతి
మహబూబ్‌నగర్: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో కటుకున్న భార్యనే గొంతు పిసికి ఉరేశాడో తాగుబోతు భర్త. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం సింగరాయపల్లి గ్రామంలో గురువారం జరిగింది.
వివరాల్లోకి వెళేతే.. గ్రామానికి చెందిన రాంచందర్(38), బుజ్జమ్మ(30) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రాంచందర్ బుధవారం రాత్రి పీకల దాకా తిగి వచ్చి నిద్రిస్తున్న భార్యను గొంతు నులిమి చీరతో ఉరేసి చంపేశాడు.
గురువారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా.. తన భార్యనే ఆత్మహత్య చేసుకుందని బుకాయించేందుకు ప్రయత్నించాడు నిందితుడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి
మెదక్ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన భారీ కురిసింది. కంగ్జి మండలం తురవాడగామ గ్రామ శివారులో గురువారం పిడుగుపాటుకు గురై ముగ్గురు మహిళలు పద్మమ్మ(50), ఆజీబి(40), తమీజాబేగం(20) దుర్మరణం చెందారు. ముగ్గురు పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.
చిలుకూరు కోనేటిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
రంగారెడ్డి: చిలుకూరు బాలాజీ ఆలయ కోనేటిలో పడి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి చెల్లెలి భర్త అయిన రఘునందన్(69)ది తమిళనాడు. ఆయన బుధవారం చిలుకూరు వచ్చాడు.
బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడు. ఈ విషయమై రఘునందన్ బుధవారం రాత్రి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆలయ కోనేటిలో శవమై తేలగా అక్కడి వారు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications