తప్పతాగి నడిరోడ్డుపై రచ్చ చేసిన యువతి
మద్యం మత్తులో నడి రోడ్డుపై ఓ యువతి రచ్చ చేసింది. ఆటో డ్రైవర్‌తో పాటు స్థానికులపై చిందులు తొక్కింది.
హైదరాబాద్: ఇటీవల కాలంలో మద్యంమత్తులో నగర వీధుల్లో బీభత్సం సృష్టిస్తున్న యువతుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, సోమవారం మద్యం మత్తులో నడి రోడ్డుపై ఓ యువతి రచ్చ చేసింది. ఆటో డ్రైవర్‌తో పాటు స్థానికులపై చిందులు తొక్కింది.
నగరానికి చెందిన సదరు యువతి సోమవారం ఫిలింనగర్ నుంచి కృష్ణా నగర్ వరకు వచ్చింది. అక్కడ ఆటో దిగిన వెంటనే డ్రైవర్ డబ్బు లు అడిగాడు. దీంతో ఆ యువతి.. ఆటో డ్రైవర్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టేసింది. అంతేగాక, ఆటో డ్రైవర్ పైకి దాడి చేయబోయింది.
గమనించిన స్థానికులు అడ్డుకునేందుకు యత్నించగా దౌర్జన్యంగా వ్యవహరించి వారిని కూడా దూషించింది. దీంతో ఆటో డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ఇదిలా ఉండగా ఈయువతి గతంలో కూడా మద్యం మత్తులో రెండు సార్లు వీధుల్లో హల్‌చల్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
డ్రగ్స్ కలకలం
నగరంలోని బంజారాహిల్స్‌లో డ్రగ్స్ ముఠా కలకలం చెలరేగింది. ఇర్దురు డ్రగ్స్ వ్యాపారులతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన జావెద్ అహ్మద్(35), బన్వర్‌లాల్‌గుప్తా(37) డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు. వీరికి నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న పురానాపూల్ ప్రాంతానికి చెందిన షేక్ షారూఖ్(22), షేక్ సల్మాన్(22)లు పరిచయం అయ్యారు. వీరు తమకు హెరాయిన్ కావాలని కోరడంతో జావెద్ అహ్మద్, బన్వర్‌లాల్‌గుప్తా ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం.8లోని వాటర్ హుక్కా సెంటర్‌కు సరుకుతో వచ్చారు.
విశ్వసనీయంగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ మాటు వేశారు. సరిగ్గా సరుకును అందజేస్తున్న సమయంలో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్దనుంచి రూ.1లక్ష విలువ చేసే 50గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులకు సహకరించిన వాటర్ హుక్కా సెంటర్ నిర్వాహకుడు మోయిన్, మేనేజర్ మతిన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications