Dog: పెంపుడు కుక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కుటుంబం..
కొంత మందికి జంతువులంటే చాలా ఇష్టముంటుంది. కొందరి ఆవులంటే ఇష్టముంటుంది. మరికొందరికి కుక్కలంటే ఇష్టముంటుంది. ఇంకొందరికి పిల్లలంటే ఇష్టముంటుంది. కొందరు జంతువులను ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. ముఖ్యంగా కుక్కలను చాలా మంది ఇష్టపడతారు. అవి మన నుంచి దూరమైతే.. మనిషి దూరమైనట్లుగానే ఫీలవుతుంటారు. ఇలాగే ఓ పెంపుడు కుక్క చనిపోయింది.
దీంత కుక్క మృతదేహానికి సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. సంవత్సరం అయినా కుక్కను మరిచిపోలేకపోతుంది ఖమ్మం కు చెందిన ఓ కుటుంబం. కుటుంబం లో ఓ బిడ్డలా మనిషిలా చూసుకున్న కుక్కకు వర్ధంతి నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రవాణా శాఖ అధికారి తోట కిషన్ రావు కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. 2015 అక్టోబరు 2న పుట్టిన 'పుగ్ బ్రీడ్ కు చెందిన శునకాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు.

కుక్కకు రెక్స్ అని పేరు పెట్టి కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు ప్రతీ సంవత్సరం అక్టోబరు 2న పుట్టిన రోజు కూడా ఘనంగా చేశారు. రెక్స్ 2021 జులై 20న అనారోగ్యంతో చనిపోయింది. మనిషిలా చూసుకున్న కుక్క చనిపోవడంతో ఆ రోజు కుక్కకు మనుషులకు చేసినట్లుగానే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాతి కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
రెక్స్ చనిపోయి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. ఆ కుటుంబం దాన్ని మరిచిపోవడం లేదు. కుక్కకు సంబంధించి జ్ఞాపకాలు కుటుంబ సభ్యులు మరిచిపోవడం లేదు. రెక్స్ చనిపోయిన తర్వాత మొదటి, రెండో వర్థంతి ఘనంగా నిర్వహించారు.












Click it and Unblock the Notifications