యువతికి స్నేహితురాలి ప్రేమికుడి వేధింపులు: ఆత్మహత్య
నల్గొండ: మరో జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. లెక్చరర్ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో యువతి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది.
మామిడాలకు చెందిన ఇరుగుదిండ్ల పార్వతి(24), తన చిన్నాన్న కూతురైన పానగల్‌కు చెందిన యువతిని తన బంధువులైన వెంకన్న, విజయ్ కొంతకాలంగా వెంటపడి వేధిస్తున్నారు. దీంతో ఏడాది క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి హెచ్చరించారు.

కాగా, ఇటీవల వెంకన్న, విజయ్ కలిసి తాము ప్రేమించే అమ్మాయితో మాట్లాడించాలని పార్వతిని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతి సెప్టెంబర్ 3న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, చికిత్స పొందుతూ పార్వతి ఆదివారం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న తిప్పర్తి పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications