Wanaparthy: గురుకుల విద్యార్థికి పాము కాటు.. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో పరిస్థితి విషమం..

గురుకులాల్లో చదివే విద్యార్థులకు భద్రత కరువైంది. చాలా గురుకుల విద్యాలాయాలు ఇప్పటికీ రేకుల షేడ్లలో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో చాలా వరకు గురుకులాలు ఊరికి దూరంగా అడవుల్లో ఉన్నాయి. తాజాగా ఓ విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది. వీపనగండ్ల గురుకుల పాఠశాలలో పాన్గల్ మండలం బాద్రుగూడెంకు చెందిన మహేందర్ 10వ తరగతి చదువుతోన్నాడు.

శనివారం రాత్రి మహందర్ డిన్నర్ చేసి పడుకున్నాడు. అయితే అతన్ని రాత్రి 10 గంటల సమయంలో పాము కరిచింది. దీంతో తోటి విద్యార్థులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కు సమచారం అందించారు. అయితే చాలా నిర్లక్ష్యం, బాధ్యతరహిత్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ ఏం గొడవ చేయకుండా పడుకోవాలని హుకుం జారీ చేశాడు. దీంతో విద్యార్థులు పడుకున్నారు. అయితే ఉదయం మహేందర్ పరిస్థితి విషమించింది.

A gurukula school student was bitten by a snake in Vanaparthi district

దీంతో తోటి పిల్లు వాచ్ మెన్ సహాయంతో మహేందర్ ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మహేందర్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారని సూచించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బాలుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరో ఘటలో 32 విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం భట్టుపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్, హాస్టల్ ఫుడ్ పాయిజన్ కావడంతో 32 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి చికెన్ తిన్న విద్యార్థులు వెంటనే కడుపు నొప్పి, వాంతులు, విరేచనలతో ఇబ్బంది పడ్డారు. ఫుడ్ పాయిజన్ పై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+