పెద్దలు అడ్డు చెప్పారని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియుడు మృతి
కరీంనగర్: ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డుచెప్పారని.. ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. కాగా, యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్‌జిల్లా గోదావరిఖనిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... స్థానిక అన్నపూర్ణ కాలనీకి చెందిన రహీమ్(25), ఆదిలాబాద్‌కి చెందిన యువతి(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం రహీంకు మరో యువతితో వివాహం జరిపించారు.
అయినా రహీం... ఆదిలాబాద్‌కు చెందిన యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ శనివారం రాత్రి 11గంటలకు తాము చనిపోతున్నట్లు బంధువులకు సమాచారమందించి.. గోదావరినది వంతెన వద్ద విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు.

ఆస్పత్రికి తరలిస్తుండగా రహీం మృతిచెందాడు, యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
బాలికపై అత్యాచారయత్నం
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ ఆర్మీ జవాన్ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఆర్‌కె పురం అంతేయ కాలనీలో నివాసముంటున్న 13ఏళ్ల బాలిక ఓ ఆర్మీ అధికారి దగ్గర ఇంటి పని చేస్తోంది. శనివారం రాత్రి ఇంటిపని ముగించుకొని ఓ షాపు దగ్గర సరుకులు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాన్ ఆ బాలికను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
బాలిక వెంట తోడుగా వచ్చిన ఆమె చెల్లెలు సహాయంకోసం కేకేలు వేయడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆర్మీ జవాన్ పరారయ్యాడు. బాలిక పరిస్థితిని గమనించిన స్థానిక ప్రజలు గొడవ చేశారు. అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని బయటకు తీసుకురావాలని ఆందోళనకు దిగారు. దీంతో ఆర్మీ జవాన్లు... స్థానికులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.
అనంతరం బాధిత బాలికతో సహా కుటుంబసభ్యులు, స్థానిక ప్రజలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆర్మీ జవాన్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచార యత్నానికి పాల్పడిన ఆర్మీ జవాన్‌ను కఠినంగా శిక్షించి, బాధితబాలికకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications