వ్యక్తిని ఢీకొట్టి శవాన్ని పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శనివారం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. దాంతో ఆ వ్యక్తి కారు టాప్‌పై పడి మరణించాడు. శవంతోనే కారును డ్రైవర్ పది కిలోమీటర్ల మేర తోలుకెళ్లాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఆమంచి గ్రామం వద్ద జరిగింది.

హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దాంతో వ్యక్తి ఎగిరి కారు టాప్‌పై పడి మరణించాడు. దాంతో స్తానికులు కారును వెంబడించారు. వారిని తప్పించుకునేందుకు డ్రైవర్ శవంతోనే దాదాపు పది కిలోమీటర్ల మేర కారును తోలుకెళ్లాడు.

చివరకు స్థానికులు కారును నిలిపేసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు వద్దకు చేరుకున్నారు. డ్రైవర్ కారును నడిపే సమయంలో తాగి ఉన్నాడా అనే విషయాన్ని తేల్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడిని వెంకట్ రెడ్డిగా గుర్తించారు.
ఆర్టిఎ కార్యాలయంపై దాడి
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంపై వాహనదారులు దాడి చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో పనుల నిమిత్తం ఆఫీస్‌కు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పలువురు వాహనదారులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications