మేడ్చల్‌లో పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. వీడియోలు తీశారు కానీ

హైదరాబాద్ నగర శివారు మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచిచంపారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా తాపీగా అక్కడ్నుంచి జారుకున్నారు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఉమేష్ (25)ను ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, దుండగులు హత్య చేస్తున్నప్పడు ఘటనా స్థలంలో చాలా మంది ఉన్నప్పటికీ వీడియోలు తీస్తూ ఉండిపోయారు కానీ.. నిందితులు అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకపోవడం శోచనీయం.

A man was brutally murdered in broad daylight in Medchal

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరు? ఎందుకు ఉమేష్ ను చంపారనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, ఉమేష్ మృతదేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వారు కోరారు.

తమ్ముడే హంతకుడు

మేడ్చల్‌ బస్ డిపో ఎదురుగా జరిగిన హత్య కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. సొంత తమ్ముడే సోదరుడు ఉమేష్‌‌ను మరో వ్యక్తి కలిసి హత్య చేసినట్లే తెలిసింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ప్రతిరోజు మద్యం తాగుతూ కుటుంబసభ్యులను కొడుతున్నాడనే కోపంతోనే ఉమేష్‌ను అతని సోదరుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+