బస్సులో సైకో .. చేతిలో నాలుగు కత్తులు ... హడలెత్తిన ప్యాసెంజర్స్
కొత్తగూడెం : ఆర్టీసీ బస్సు తన గమ్యస్థానానికి బయల్దేరింది. బస్సుల్లో అందరూ స్తబ్ధుగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆందోళన .. కళ్లు మూసి తెరిచేవరకు అప్పటివరకు తమతో ఉన్న ప్రయాణికుడి లోపలి సైకో బయటకొచ్చాడు. దీంతో ప్యాసెంజర్స్ బెంబేలెత్తిపోయారు.
బస్సులో సైకో ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వెళ్తుంది. దమ్మపేట మండలం మందపల్లి-ముష్టిబండ వద్ద బస్సులో ఉన్న వ్యక్తి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. అప్పటివరకు తమతో ఉన్నది సైకో అని ప్రయాణికులు భయపడ్డారు. తన వద్ద ఉన్న నాలుగు కత్తులు తీసి చంపుతానని బెదిరించాడు. దీంతో కండక్టర్ సహా ప్రయాణికులు గజ్జుమని వణికిపోయారు. అయితే అతనిని తెలివిగా పట్టుకున్నారు.

అతనికి దేహశుద్ధి చేశారు. కాసేపు తమను ఆందోళనకు గురిచేసిన సైకోపై తమ ప్రతాపం చూపించారు. అతని నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు .. సైకోను అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితిని అంచనా వేసి .. వైద్యులు అందజేసే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు.
బెదిరిపోయారు ...
అయితే బస్సులో కాసేపు ప్రయాణికుడు చేసిన బీభత్సంతో ప్యాసెంజర్స్ వణికిపోయారు. ఏం చేయాలని ఆలోచించారు. అతని చేతుల్లో ఉన్న కత్తి తమపై దాడి చేస్తే ఏంటి అని మదనపడ్డారు. అయితే చివరికి పట్టుకొని .. దేహశుద్ధి చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే తమ పరిస్థితి ఏంటి అని గజ గజ వణికిపోయారు.












Click it and Unblock the Notifications