చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య.. పక్కన్నే 'ఏ' అని రాసి..
ఆత్మహత్యకు చేసుకున్న చోట 'A'అనే అక్షరం రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్: వరంగల్ హైవే వద్ద ఓ విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని చైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన కృష్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఘటన జరిగిన తీరును పరిశీలించారు.

ఆత్మహత్యకు చేసుకున్న చోట 'A'అనే అక్షరం రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణారెడ్డి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరయినా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న కోణంలోను పోలీసుల విచారణ కొనసాగనుంది. కృష్ణారెడ్డి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications