రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ కలకలం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సమీపంలో అనుామానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ్నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు.

ఆ బ్యాగ్‌లో ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఆ బ్యాగ్ ఎవరు అక్కడ పెట్టారనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

A suspicious bag appeared near to CM Revanth Reddy s house

వరద బాధితుల కోసం ముందుకొస్తున్న దాతలు

వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత సువెన్ లైఫ్ సైన్సెస్ (Suven Life Sciences Ltd) సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించింది. సంస్థ చైర్మన్, సీఈవో వెంకట్ జాస్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఉదారతను చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత దివిస్‌ ల్యాబొరేటరీస్‌ (Divi's Laboratories) సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. సంస్థ సీఈవో డాక్టర్ కిరణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+