బదిలీ మనస్తాపం: రైలు కిందపడి టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తనకు బదిలీ అయిందన్న మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర లాలాగూడ, సాయినగర్ కాలనీకి చెందిన నారాయణ కుమారుడు ఎం ప్రభాకర్(45) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

వారం కిత్రం ఆయన్ను చెన్నై బదిలీ చేశారు. అక్కడికి వెళ్లిన అతడు తిరిగి హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరినా సంస్థ యాజమాన్యం అంగీకరించకపోవడంతో శుక్రవారం ఇక్కడికి వచ్చేశారు.
శనివారం ఉదయం లాలాగూడ రైల్వే వసతి గృహాల సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులకు అందిన సమాచారం మేరకు వెళ్లి పరిశీలించారు. గుర్తింపు కార్డు ఆధారంగా ప్రభాకర్‌గా గుర్తించారు. కుటుంబసభ్యుల ద్వారా ఆత్మహత్యకు గత కారణాన్ని తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications