రాత్రివేళ అమ్మాయిల గదుల్లోకి వెళ్లి అసభ్య ప్రవర్తన: టెక్కీ అరెస్ట్
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాత్రివేళలో అమ్మాయిల గదుల్లోకి వెళ్లి హంగామా సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి అంబర్‌పేటలో జరిగిన ఈ ఘటనపై యువతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంబర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక శంకర్‌నగర్‌కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు. కాగా, ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

గత ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో మద్యం మత్తులో నిషాంత్.. వారింట్లో అద్దెకు ఉంటున్న అమ్మాయిల గదుల్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగువారిని సాయం కోసం పిలిచారు. వారు నిషాంత్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
దొంగతనం కేసులో నిందితురాలి అరెస్టు
హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలతోపాటు, రూ.65వేల నగదును అపహరించిన కేసులో ఓ మహిళను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.












Click it and Unblock the Notifications