శివ మా అమ్మ ఇంకా చనిపోలేదు చంపుదాం రా
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి అంజలి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన పదో తరగతి బాలిక, చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు అని తెలియడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం బాలికకు నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తమ పదో తరగతి వయసులో ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించడంతో, వారం రోజుల క్రితం బాలిక శివతో కలిసి వెళ్లిపోయింది. అయితే, కేవలం మూడు రోజుల క్రితమే ఆమె తిరిగి ఇంటికి వచ్చింది.

ఈ క్రమంలోనే, తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని తొలగించుకోవాలని బాలిక తన ప్రియుడు శివతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. పథకం ప్రకారం, నిన్న సాయంత్రం నల్గొండ నుంచి శివ వచ్చాడు. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా, శివ వెనుక నుంచి ఆమెపై దాడి చేసి బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పాడు. ఆ తర్వాత, స్వయంగా కూతురే సుత్తితో తల్లి తలపై కొట్టగా, శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో అంజలి పీక కోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన నిందితురాలు తేజశ్రీ చెల్లి ప్రియ చేసిన వాంగ్మూలం మరింత భయానక విషయాలను వెలుగులోకి తెచ్చింది. చిన్న కూతుతరు ప్రియ మాట్లాడుతూ.. ట్యూషన్ నుంచి వస్తున్న నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది. పదా వెళ్దాం అని తీసుకెళ్లిందని తెలిపింది. 20 నిమిషాల తర్వాత తాము ఇంటికి చేరుకోగా, అప్పటికే కిచెన్‌లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉందని పేర్కొంది. అమ్మను నేను చూసుకుంటా... నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకుని రా... గల్లీలో ఆంటీ వాళ్లకు ఎవరికీ చెప్పకు అని అక్క చెప్పిందని వెల్లడించింది.
అంతేకాకుండా, మా అమ్మ ఇంకా చనిపోలేదు అని తెలుసుకున్న అక్క... మళ్లీ శివకు కాల్ చేసింది. అమ్మ ఇంకా చనిపోలేదు. కాళ్లు చేతులు ఆడిస్తోందని చెప్పింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చారు. సుత్తితో అమ్మ తలపై కొట్టారు... చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయారని ప్రియ చెప్పింది. నేను అప్పుడే వచ్చాను. చూసేసరికి అమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. వెళ్లి చేతులు రుద్దాను... లేపే ప్రయత్నం చేశాను. కానీ అక్క మాత్రం దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది, లేపి వేస్ట్ చెప్పిందని ప్రియ వివరించింది.












Click it and Unblock the Notifications